ఏ.ఐ.ఎం.ఈ.ఆర్. సొసైటీ జీవిత సాఫల్య పురస్కారం అందుకున్న డా. బుర్రా కరుణ కుమార్

Mar 19,2024 17:41 #Krishna district

ప్రజాశక్తి ‌- గుడ్లవల్లేరు : స్ధానిక శేషాద్రి రావు గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ బుర్రా కరుణ కుమార్ బోధనా పరంగా మరియు పరిశోధనా రంగంలో నిరంతరం కృషి చేస్తూ నిరంతర విద్యార్ధిగా ఉంటూ విద్యార్ధుల్లో నూతన ఆవిష్కరణల స్ఫూర్తి రగిలిస్తున్నందుకు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ మెడికల్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చర్స్ సొసైటీ నుండి జీవన సాఫల్య పురస్కారం పొందారు. గత నలబై రెండు సంవత్సరాలలో పాలిటెక్నిక్ లో డిమానిస్ట్రేటర్ నుండి ఇంజనీరింగ్ కళాశాలలో వివిధ స్థాయిలలో సేవలందిస్తూ ప్రస్తుతం ప్రిన్సిపాల్ గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ బుర్రా కరుణ కుమార్ కు ఏ.ఐ.ఎం.ఈ.ఆర్. సొసైటీ నుండి జీవన సాఫల్య పురస్కారం రావడం హర్షించదగ్గ విషయమని యాజమాన్య సలహాదారులు డాక్టర్ పి. రవీంద్ర బాబు అన్నారు. విద్యా సంబంధిత విషయాల్లో సుస్ధిరమైన, శ్రేష్టమైన స్మారక సాధనలు, సహకారం, సమర్ధవంతమైన అలసిపోని నిరంతర విద్యా విషయక జ్ఞానం,అన్వేషణ, ఆవిష్కరణ, విజయాలను సర్వేల ద్వారా గుర్తించి స్మారకం గా ఈ అవార్డును ప్రకటించిన విషయ ధృవీకరణ పత్రాన్ని ఏ.ఐ.ఎం.ఈ.ఆర్. సొసైటీ అధ్యక్షులు డి. సాయి సతీష్ కళాశాల ప్రాంగణంలో జరిగిన సభలో అందజేసారు. అంతేకాకుండా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర్ బాబూరావు మార్కపూడి కు ఇన్నోవేటివ్ టీచింగ్ ఎక్సలెన్స్ అవార్డు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ కవిత చదువుల కు స్టూడెంట్ మెంటార్ షిప్ అండ్ డెవలప్మెంట్ అవార్డు అందుకున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ బుర్రా కరుణ కుమార్ తెలిపారు. భవిష్యత్తులో నేటి తరం విద్యార్ధులను నాయకులుగా, సాంకేతిక ఆలోచనా పరులుగా తీర్చిదిద్దడంలో అనుసరిస్తున్న, అవలంభిస్తున్న స్ఫూర్తిదాయక విధానాలకు డాక్టర్ బాబూరావు మార్కపూడి కి, విద్యా పరమైన విషయాల్లో విద్యార్ధుల నిరంతర ఎదుగుదలకు, వ్యక్తిత్వాభివృద్ధికి కృషి చేస్తున్నందుకు డాక్టర్ కవిత చదువుల లను ఈ అవార్డులకు ఎంపిక చేసి అందజేసినట్లు ఏ.ఐ.ఎం.ఈ.ఆర్. సొసైటీ అధ్యక్షులు డి. సాయి సతీష్ తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బుర్రా కరుణ కుమార్ కు, డాక్టర్ బాబూరావు మార్కపూడి, డాక్టర్ కవిత చదువుల లకు ఈ అవార్డులు రావడం పట్ల కళాశాల యాజమాన్యం, కళాశాల యాజమాన్య సలహాదారులు డాక్టర్ పి.రవీంద్ర బాబు, వైస్ ప్రిన్సిపాల్స్ డాక్టర్ పి.కోదండ రామారావు, డాక్టర్ ఎం.ఆర్.సి.హెచ్.శాస్త్రి, పి.జి.సి.అర్.డి. డైరెక్టర్ డాక్టర్ జి.వి.ఎస్.ఎన్.ఆర్.వి. ప్రసాద్, వివిధ విభాగాధిపతులు, మెంటర్స్, అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది హర్షం వ్యక్త పరచి శుభాభినందనలు తెలియజేశారు.

➡️