మే 19 నుంచి మోదకొండమ్మ ఉత్సవాలు

Mar 17,2024 23:01
హాజరైన ఆలయ కమిటీ సభ్యులు, పెద్దలు

ప్రజాశక్తి-పాడేరు: మన్యం ప్రజల ఇలవేల్పు మోదకొండమ్మ అమ్మవారి వార్షిక జాతర మహౌత్సవములు పాడేరులో ఈ ఏడాది మే నెల 19, 20, 21, తేదీల్లో నిర్వహించేందుకు నిర్ణయించినట్లు మోదకొండమ్మ ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి కొట్టగుల్లి సింహాచలం నాయుడు వెల్లడించారు అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని కళ్యాణ మండపంలో ఉత్సవాల నిర్వహణపై తేదీలు ఖరారు చేసేందుకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులతో ఆదివారం సాయంత్రం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ, ఏటా నిర్వహిస్తున్న మోదకొండమ్మ అమ్మవారి ఉత్సవాలను అతి వైభవంగా నిర్వహించేందుకు అన్ని విధాలుగా సహకరించి జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, సభ్యులు, ఉద్యోగ వర్తక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

➡️