రోడ్డును బాగు చేయండి..

రాళ్లు తేలిన రహదారిబస్కి

అరకువేలి నుండి బస్కీ వెళ్లే రహదారి మార్గం గుండా అరకువేలి మండలం బస్కి, మాడగడ, సుంకరమెట్ట పంచాయతీ, హుకుంపేట మండలం బూర్జ, పట్టం, గతుం, అనంతగిరి మండలం పైనంపాడు, వేంగడ పంచాయతీలకు చెందిన గిరిజనులు అరకువేలి మండల కేంద్రానికి నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. రోడ్డు పూర్తిగా మరమ్మతులకు గురి కావడంతో గిరిజనులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. రహదారి పొడవునా గుంతల మయంగా అధ్వానంగానూ, ఎత్తుపల్లాలుగా ఉండటంతో వాహనదారులు భయం భయంగా రాకపోకలు సాగిస్తున్నారు.గుంతలతో పలు మార్లు పమాదాలు ఈ రోడ్డు మరమ్మతుఎ గురి కావడంతో పలు ప్రమాదాలు జరుగుతున్నాయి. మాడగడ యు పాయింట్‌ పాల సముద్రం వీక్షించడానికి వెళుతున్న పర్యాటకులు ప్రమాదాల బారిన పడుతున్నారు. వర్షాకాలంలో వర్షపు నీటితో నిండిన గుంతలను గుర్తించక ప్రమాదాలకు గురవుతున్నారు. గతంలో ప్రయాణికులతో వెళ్తున్న ఆటో మాడగడ యూ పాయింట్‌ సమీపంలో అదుపుతప్పి పక్కనే ఉన్న వాగులోకి దూసుకు పోయింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. గతంలో రోడ్డు మార్గం గుండా బస్సు సౌకర్యం ఉండేది. ప్రస్తుతం రోడ్డు మరమ్మతుకు గురి కావడంతో ప్రస్తుతం బస్సు సౌకర్యం లేదు. దీంతో, ఈ ప్రాంత గిరిజన వాసులు ఆయా గ్రామాలకు రాక పోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలువురు గిరిజనులు కాలినడకన, వాహనాలపైనే వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ఇబ్బంది పడుతున్నారు. రోడ్డు బాగోలేక ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని, ఇంత జరుగుతున్నా ఎమ్మెల్యే, అధికారులు స్పందించకపోవడం దారుణమని స్థానికులు మండి పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి అరకువేలి నుంచి బస్కి వెళ్లే రోడ్డు మరమ్మతులు చేపట్టి ప్రాణాలు కాపాడాలని గిరిజనులు విజ్ఞప్తి చేస్తున్నారు.

➡️