మల్లెతోట అగ్ని బాధితులకు సిపిఎం సాయం 

ప్రజాశక్తి-చింతూరు : చింతూరు మండలం ఏజీ కోడేరు గ్రామపంచాయతీ పరిధిలోని మల్లెతోట గ్రామంలో గురువారం మధ్యాహ్నం జరిగిన అగ్ని ప్రమాదంలో ఆరుగురు గిరిజన కుటుంబాలకు చెందిన ఇల్లు కాలిపోయినాయి. కట్టు బట్టలతో రోడ్డుపై పడిన ఆరు కుటుంబాలకు చింతూరు సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో ఆరు కుటుంబాలకు వారికి ఒక్క కుటుంబానికి 25 కేజీల బియ్యం లీటర్ మంచినూని కేజీ కందిపప్పు ఇతర నిత్యావసర కూరగాయలను అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ రంపచోడవరం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి లోత రామారావు మాట్లాడుతూ బాదిత కుటుంబాలకు తక్షణసాయంగా 50 వేల రూపాయలు అందజేయాలని నష్టపోయిన బాధితులు అందరికీ పక్కా ఇల్లు నిర్మించాలని దానికిగాను ఒక్కో కుటుంబానికి 5 లక్షల రూపాయల వ్యయంతో ఇల్లు నిర్మించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వేసవికాలంలో తరచూ అగ్ని ప్రమాదాలకు గురి అవుతున్న ఆదివాసి గిరిజన పల్లెల్లో అగ్ని ప్రమాదం నుండి వారిని కాపాడేందుకు అగ్నిమాపక కేంద్రాన్ని చింతూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేయాలని వేసవి రెండు నెలలు కూడా అగ్నిమాపక శకటాలను పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. జిల్లా కార్యదర్శి బొప్పన కిరణ్ మాట్లాడుతూ అగ్ని ప్రమాదం జరిగి సర్వస్వం కోల్పోయిన ఆరుగురు ఆదివాసి కుటుంబాలకు తమకు తోచిన విధంగా దాతలు సహకరించాలని ఎంత ఇచ్చిన కానీ జరిగిన నష్టాన్ని మాత్రం పూడ్చ లేనిది అని అన్నారు. ప్రభుత్వమే బాధ్యతలను పరిగణలోకి తీసుకొని అన్ని విధాల ఆదుకోవాలని విలువైన విద్యార్థుల సర్టిఫికెట్లు ఆధార రేషన్ కార్డులు ఇతర ఇంటి ధ్రువీకరణ పత్రాలు పట్టాదారు పాసుబుక్కులు వంటివి మరలా వీరికి అన్ని రకాల పత్రాలను అందజేయాలని తెలిపారు. ఈ బాధితులను సందర్శించిన వారిలో మండల కార్యదర్శి సీసం సురేష్, సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు వెంకట్, పూనెం సత్యనారాయణ, మండల కమిటీ సభ్యులు లక్ష్మణ్, కారం నాగేష్ కారం సుబ్బారావు బీరభైన దిలీప్ మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

➡️