మొక్కల పంపిణీలో జాప్యం : సిపిఎం

Jun 30,2024 00:31
నాంది సంస్థ మొక్కలు పరిశీలిస్తున్న సన్నిబాబు

ప్రజాశక్తి- పెదబయలు: మండలంలో 23 గ్రామ పంచాయతీల పరిధిలో 2023 సంవత్సర కాలంలో ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎస్‌ పథకం ద్వారా రైతులకు సిల్వర్‌ మొక్కల పంపిణీలో నిర్లక్ష్యం వహించడం తగదని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బొండా సన్నిబాబు తెలిపారు. నాంది సంస్థ పంపిణీ చేస్తున్న మొక్కలను పరిశీలించిన ఆయన మాట్లాడుతూ, 2023 సంవత్సరంలో గ్రామీణ ఉపాధి పథకం కింద మొక్కలు వేసే భూములను జీయో టాగింగ్‌ చేసి, ఎష్టమేషన్లు వేసి, మొక్కలు నాటుటకు గొయ్యిలు తవ్వించి, నేటికి పంపిణీ చేయక పోవడం అన్యాయమన్నారు. గోతులు తవ్విన ఉపాధి కూలీలకు నేటి వరకు కూలీ చెల్లించలేదన్నారు.ఉపాధి హామీ పథకం ద్వారా అభివృద్ధి చేయుటకు ప్రభుత్వం నిధులు కేటాయిస్తుంటే అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా ఉండట సరికాదన్నారు. నాంది సంస్థ ‘రైతులకు సకాలంలో మొక్కలు పంపిణీ చేసిందన్నారు.ఇప్పటికైనా గిరిజన రైతులకు సకాలంలో సిల్వర్‌ మొక్కలు పంపిణీ చేసి, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై శాఖా పరమైన చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

➡️