ప్రశాంతంగా ముగిసిన పోస్టల్‌ బ్యాలెట్‌

పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌

ప్రజాశక్తి-పాడేరు:- పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ ప్రక్రియ అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రశాంతంగా ముగిసింది. కంట బౌన్స్‌గూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోస్టల్‌ బ్యాలెట్‌ ఫెసిలిటీస్‌ సెంటర్లో ఐదవ రోజు 598 మంది తమ ఓటు హక్కును వినియోగించు కున్నారని అరకు అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి వి.అభిషేక్‌ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అరకు నియోజకవర్గంలో 516 మంది, పాడేరు అసెంబ్లీ నియోజకవర్గానికి 53 మంది, జిల్లాలకు చెందిన వారు 29 మంది పోస్టల్‌ బ్యాలెట్‌ విధానంలో ఓటు హక్కును వినియోగించుకున్నారని ఆయన చెప్పారు. అనంతరం తహసిల్దార్‌ కార్యాలయం వద్ద ఈవీఎంల డిస్ట్రిబ్యూషన్‌పై ఏర్పాటు చేసిన ప్రణాళికను అధికారులకు వివరించారు. ప్రణాళిక ప్రకారం ఈవీఎంల పంపిణీ చేయాలని ఆదేశించారు. ప్రతి మండలానికి ప్రత్యేకంగా పంపిణీ సెల్‌ను ఏర్పాటు చేశామన్నారు.ఈ కార్యక్రమంలో ఐటిడిఏ సహాయ ప్రాజెక్టు అధికారి ఎం.వెంకటేశ్వరరావు, ఎస్‌డిసివిఎస్‌ శర్మ, తహసిల్దార్‌ సుధాకర్‌, సోమేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి ఎస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మాట్లాడుతూ, అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన 434 మంది పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకోవడం జరిగిందన్నారు.ఇతర జిల్లాల నుండి 58 మంది, పాడేరు నుండి ఒక్కరు పోస్టల్‌ బ్యాలెట్ను ఉపయోగించుకోవడం జరిగిందని రిటర్నింగ్‌ అధికారి తెలిపారు.

➡️