బాధితులకు ఆర్థిక సహాయం  

May 20,2024 10:30 #anakapalle district

ప్రజాశక్తి – బుచ్చయ్యపేట(అనకాపల్లి) : మండలంలో గల రాజాం గ్రామంలో మే 16 జరిగిన గ్యాస్ బండి పేలి పురిల్లు దగ్ధం కావటం తో భారీ నష్టపోయిన గొర్లి శ్రీను కుటుంబంకి రాజాం యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సమాకూర్చిన 33,000 రూపాయలు నగదును సోమవారం బాధిత కుటుంబానికి అంద చేసారు. రాజాం గ్రామంలో మే 16 జరిగిన గ్యాస్ బండి పేలి పురిల్లు దగ్ధం కావటంతో భారీ నష్టం జరిగింది. గొర్లి శ్రీను అనే వ్యక్తికి రాజాం యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 33000 రూపాయలు ఆర్థిక సహాయం చేయటం జరిగింది, ఇలా ఈ అసోసియేషన్ గత కొన్ని సంత్సరాలుగా ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంది. దీనికి సహకరించిన వారందరికీ వారు కృతజ్ఞతలు తెలిపారు.

➡️