చంద్రబాబు పర్యటన ఏర్పాట్లు పరిశీలన

ఏర్పాట్లను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే కేశవ్‌, టిడిపి నాయకులు

      ఉరవకొండ : చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ టిడిపి నాయకులతో కలిసి శుక్రవారం నాడు పరిశీలించారు. టిడిపి జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులుతో పాటు స్థానిక టిడిపి,జనసేన నాయకులతో కలిసి సభా ప్రాంగణంతోపాటు హెలీప్యాడ్‌ వద్ద పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌, పార్టీ జిల్లా అధ్యక్షులు కాలవ శ్రీనివాసులు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ప్రతి పార్లమెంట్‌ పరిధిలో నిర్వహిస్తున్న రా కదిలా రా కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తోందన్నారు. ఉరవకొండలో జరిగే ఈకార్యక్రమానికి నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండలాల నుంచి తెలుగుదేశం,జనసేన పార్టీల కార్యకర్తలు, అభిమానులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

➡️