జగన్‌తోనే బడుగుల అభివృద్ధి

మహిళలకు కరపత్రం అందజేస్తున్న ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి

 

ప్రజాశక్తి-ఆత్మకూరు

సిఎం జగన్‌తోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, బడుగుల అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి అన్నారు. ఆదివారం రాప్తాడు మండలం పాలచర్ల గ్రామంలో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకోవడంతోపాటు ప్రభుత్వ పథకాలను వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పాలచర్ల గ్రామంలో సరాసరి ప్రతి ఇంటికీ రూ.2 నుంచి రూ.2.5 లక్షల వరకూ వివిధ పథకాల ద్వారా లబ్ధి చేకూరిందన్నారు. జగన్‌ అధికారంలోకి వచ్చాక ఈ గ్రామానికి సంబంధించి బోగినేపల్లి ఆయకట్టుకు హంద్రీనీవా నీళ్లు వచ్చాయన్నారు. దీంతో భూగర్భజలాలు పెరిగి పేరూరు ఆయకట్టు కింద బీడుగా ఉన్న 3700 ఎకరాల భూములు సస్యశ్యామలం అయ్యాయన్నారు. అనంతరం ఆత్మకూరు మండలం తోపుదుర్తిలో 137 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ ఛైర్‌పర్సన్‌ బోయ గిరిజమ్మ, మండల కన్వీనర్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, వైస్‌ ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, అధికారులు పాల్గొన్నారు.

➡️