ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

విలేకరులతో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి

ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్‌

ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వచ్చే ఎన్నికల్లో టిడిపి జెండా ఎగురవేద్దామని మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్‌చౌదరి పిలుపునిచ్చారు. శుక్రవారం టిడిపి అర్బన్‌ కార్యాలయంలో నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 20న విశాఖపట్నంలో నిర్వహించే యువగళం ముగింపు సభను పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. భవిష్యత్తుకు గ్యారెంటీ ఇది బాబు గ్యారెంటీ కార్యక్రమంలో రాష్ట్రంలో అనంతపురం నియోజకవర్గాన్ని మొదటి స్థానంలో నిలపాలన్నారు. ప్రజల మద్దతు కూడగట్టి టిడిపిని గెలిపించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అర్బన్‌ పరిశీలకుడు రమణారెడ్డి, టిడిపి నగర అధ్యక్షుడు మారుతీకుమార్‌గౌడ్‌, సీనియర్‌ మైనారిటీ నాయకులు సాలార్‌ భాషా, తలారి ఆదినారాయణ, దాసరి శ్రీధర్‌, గాజుల అదెన్న, బంగి నాగ, మార్కెట్‌ మహేష్‌, వన్నూర్‌, ముక్తియార్‌, పోతుల లక్ష్మీనరసింహులు, జేయం బాషా, గోపాల్‌గౌడ్‌, రాజారావు, సురేంద్ర, వంకదారు వెంకటకృష్ణ, సైపుద్దీన్‌, డాక్టర్‌ లక్ష్మీప్రసాద్‌, గుర్రం నాగభూషణ, తెలుగు మహిళలు స్వప్న, విజయ శ్రీ రెడ్డి, సంగా తేజస్విని, సరళ, దలవాయి రమాదేవి, శరీనా, హసీనా, సుజాత, జానకి, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.

➡️