మానవ వనరులను సద్వినియోగం చేసుకోవాలి

మానవ వనరులను సద్వినియోగం చేసుకోవాలి

కార్యక్రమంలో మాట్లాడుతున్న నెహ్రూ యువకేంద్రం ప్రోగ్రాం ఇన్‌ఛార్జి శ్రీనివాసులు

ప్రజాశక్తి-అనంతపురం

యువత మానవ వనరులను సద్వినియోగం చేసుకుని ఉన్నత రంగాల్లో స్థిరపడాలని నెహ్రూ యువ కేంద్రం ప్రోగ్రాం ఇన్‌ఛార్జి జి.శ్రీనివాసులు పిలుపునిచ్చారు. రూడ్‌సెట్‌ అనంతపురం, ప్రగతి పథం యూత్‌ అసోసియేషన్‌, ఎస్‌ఆర్‌ ఎడ్యుకేషనల్‌ సొసైటీ, నెహ్రూ యువ కేంద్రం అనంతపురం ఆధ్వర్యంలో యువతకు మానవ వనరుల అభివృద్ధిపై మంగళవారం శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మానవ వనరులపై అవగాహన పెంచుకోవాలన్నారు. ప్రతినిత్యం విద్యార్థులుగా ఉంటూ రోజు ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండాలి సూచించారు. అనంతరం శిక్షణ తీసుకున్న యువతకు ప్రశంసాపత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ యువ అవార్డు గ్రహీత బిసాటి భరత్‌, రూడ్‌సెట్‌ డైరెక్టర్‌ విజయలక్ష్మి, రాష్ట్రపతి అవార్డు గ్రహీత బిసాటి జీవన్‌కుమార్‌, ఓ.ప్రణతి, రూడ్‌సెట్‌ శిక్షకులు ఉషారాణి, రాష్ట్రపతి అవార్డు గ్రహీత కె.జయమారుతి, ప్రగతి పథం యూత్‌ అసోసియేషన్‌ కార్యదర్శి వై.పవన్‌, తేజస్విని, గణేష్‌, మహేంద్ర, యువకులు పాల్గొన్నారు.

➡️