సరికొత్త సాంకేతికను అందిపుచ్చుకోవాలి

మాట్లాడుతున్న జెఎన్‌టియు ఉపకులపతి రంగాజనార్ధన

 

ప్రజాశక్తి-అనంతపురం

విద్యార్థులు సరికొత్త సాంకేతికతను అందిపుచ్చుకుని అభివృద్ధి సాధించాలని జెఎన్‌టియు ఉపకులపతి రంగాజనార్ధన పిలుపునిచ్చారు. శనివారం స్థానిక జెఎన్‌టియు ఇంజనీరింగ్‌ కళాశాల కంప్యూటర్‌ సైన్సు, ఇంజనీరింగ్‌ విభాగం ఆధ్వర్యంలో స్టూడెంట్స్‌ నేషనల్‌ లెవల్‌ సింపోయిజం పిక్సెల్‌ 2కె 23 జాతీయ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇలాంటి సింపోయిజంలను నిర్వహించడం వల్ల విద్యార్థులు తమ విజ్ఞానాన్ని మరింత పెంపొందించుకునే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్‌ ఎస్‌.వి.సత్యనారాయణ, వైస్‌ ప్రిన్సిపల్‌ ఇ.అరుణకాంతి, కన్వీనర్‌ విభాగ అధిపతి కె.ఎఫ్‌.భారతి, కో కోఆర్డినేటర్లు ఎ.పి.శివకుమార్‌, జెస్సికా సరిత, వర్శిటీ డైరెక్టర్‌ బి.ఈశ్వరరెడ్డి, సి.శోభాబిందు, ఎ.సురేష్‌బాబు, జి.వి.సుబ్బారెడ్డి, కంప్యుటర్‌ సైన్సు విభాగం ప్యాకల్టీ పి.చెన్నారెడ్డి, కె.మాధవి, ఆర్‌.రాజశేఖర్‌, కళాశాల విభాగ అధిపతులు బి.దిలీప్‌కుమార్‌, ఏం.రామశేఖరరెడ్డి బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.

➡️