సాఫీగా మండల సర్వసభ్య సమావేశం

Feb 3,2024 15:34 #Anantapuram District
all members meeting
  • నూతన ఎంపీడీవో రాముడుకు స్వాగతం
  • బదిలీ అయిన ఎంపీడీవోకు దివాకర్ కు ఘన సన్మానం
  • మండలానికి దివాకర్ సేవలు మరువలేనివి

ప్రజాశక్తి-నార్పల : మండల కేంద్రంలోని స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో శనివారం మండల అధ్యక్షులు నాగేశ్వరరావు అధ్యక్షతన ఎంపీడీవో ఏసీ రాముడు ఆధ్వర్యంలో మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సర్వసభ్య సమావేశం సాఫీగా సాగింది. బండపల్లి ఎంపీటీసీ సభ్యులు శంకర్ యాదవ్ గత సమావేశంలో తెలిపిన సమస్యలు ఎంతవరకు పరిష్కారమయ్యాయి అని అధికారులను అడిగారు. గత సమావేశంలో సమస్యలు ఏవో అధికారులను అడిగి తెలుసుకుని ఎన్ని పరిష్కారమయ్యాయి అన్నది. తర్వాత తెలపడం జరుగుతుందని ఎంపీడీవో తెలిపారు. అనంతరం వివిధ శాఖల అధికారులు ఈ మూడు నెలల కాలంలో వారి వారి శాఖల పరంగా జరిగిన అభివృద్ధిని వివరించారు. ఈ సమావేశంలో వైస్ ఎంపీపీలు వెంకటలక్ష్మి మల్లేశ్వరయ్య కార్యాలయ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ ఉమాదేవి సీనియర్ అసిస్టెంట్ నూరు మొహమ్మద్ వ్యవసాయ అధికారి చెన్న వీరస్వామి ఏపీవోలు ఎర్రమ్మ రమేష్ రామారావు వెలుగు సిసి రామకృష్ణ వివిధ శాఖల అధికారులు ఎంపీటీసీలు సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా నార్పల మండల నూతన ఎంపీడీవో గా వచ్చిన రాముడు ను ఎంపీటీసీలు సర్పంచులు ప్రజాప్రతినిధులు మండల వివిధ శాఖల ఉద్యోగులు పరిచయం చేసుకున్నారు.

ఎంపీడీవో దివాకర్ కు ఘన సన్మానం

మండలానికి దివాకర్ సేవలు మరువలేనివి

వైసీపీ సీనియర్ నాయకులు సత్యనారాయణ రెడ్డి

నార్పల మండల ఎంపీడీవోగా సుమారు నాలుగు సంవత్సరాల ఏడు నెలలు సుదీర్ఘకాలం ఎంపీడీవోగా విధులు నిర్వహించి ఎన్నికల బదిలీల్లో భాగంగా కడప జిల్లాకు బదిలీ అయిన ఎంపీడీవో దివాకర్ ను శనివారం ప్రజా ప్రతినిధులు మండల వివిధ శాఖల ఉద్యోగులు పంచాయతీ కార్యదర్శులు ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది ఎంపీడీవో దివాకర్ ను ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఎంపీడీవో విధి నిర్వహణలో మండలంలో ఒక ప్రత్యేకతను ఏర్పరచుకున్నారు అని మండలప్రజలతో పాటు ప్రజాప్రతినిధులు సహఉద్యోగులు మండలంలోని వివిధ శాఖల అధికారుల అభిమానాన్ని పొందారు అని కడప జిల్లా పులివెందులకు బదలీ అయ్యారు అక్కడ కూడా ఆయన ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజల అభిమానాన్ని పొందాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు అనంతరం బదిలీ అయిన ఎంపీడీవో దివాకర్ మాట్లాడుతూ విధి నిర్వహణలో తనకు సహకారాలు అందించిన సాహ ఉద్యోగులు మండలాధికారులు సచివాలయాల సిబ్బంది పంచాయితీ కార్యదర్శులు గ్రామ వాలంటీర్లు తదితరులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ విధి నిర్వహణలో తన ద్వారా ఎవరైనా బాధపడిన ఇబ్బంది పడిన అది కేవలం విధినిర్వహణలో భాగంగానే జరిగి ఉంటుందని ఎవరైనా బాధపడి ఉంటే మనస్ఫూర్తిగా మన్నించాలని కోరారు ఈ కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకులు నార్పల సత్యనారాయణ రెడ్డి,ఎంపీపీ నాగేశ్వరరావు, జడ్పీ వైస్ చైర్మన్ నగరత్నమ్మ, ఎంపీడీఓ రాముడు, విద్యాధికారి కృష్ణయ్య, వైస్ ఎంపీపీలు వెంకటలక్ష్మి, మల్లేశ్వరయ్య, ఈఓఆర్డీ శైలజరాణి, ఏఓ ఉమాదేవి, సిద్దిలచర్ల సర్పంచ్ రామాంజనేయులు, ఎంపీటీసీలు శంకర్ యాదవ్, కటమయ్యా, పద్మాకర్ రెడ్డి, రమాదేవి, లక్ష్మిదేవి, సర్పంచ్ లు కుళ్ళయారెడ్డి, రాంభూపాల్ రెడ్డి, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ అమీర్, మైనార్టీ నాయకుడు జిలానభాష, ఇంజనీర్ రవీంద్రనాథ్ర్ రెడ్డి, వైసీపీ నాయకులు, శివయ్య, గోపాల్, భాస్కర్ నాయుడు, చౌరెడ్డి, భాస్కర్ రెడ్డి, మోహన్ పంచాయతీ కార్యదర్శులు అస్వర్థ నాయుడు, శ్రీనివాసులు, లక్ష్మిదేవి, వరలక్ష్మి, వహిదా, మల్లి కార్జున్, చరణ్, శ్రీనివాసులు, సీనియర్ అసిస్టెంట్, నూరుమహమ్మద్, జూనియర్ అసిస్టెంట్ నరేంద్ర, ఆనంద్, సురేష్, మోహన్, సచివాలయ ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.

➡️