జిల్లా ఉత్తమ ఎస్ఐగా నార్పల ఎస్ఐ

Jan 26,2024 16:09 #Anantapuram District
best si in dist narpala si

జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు అందుకున్న నార్పల ఎస్సై రాజశేఖర్ రెడ్డి 

ప్రజాశక్తి-నార్పల : జిల్లాలోని వివిధ శాఖల ఉద్యోగులను వారి శాఖలలో వారు చేసిన సేవలను, పనితీరును గుర్తించి ఉత్తమ అధికారులుగా గణతంత్ర దినోత్సవం రోజు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అవార్డులు అందజేయడం జరుగుతుంది. 75 వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లా ఉత్తమ ఎస్ఐగా నార్పల ఎస్సై రాజశేఖర్ రెడ్డి జిల్లా కలెక్టర్ గౌతమి చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. అదేవిధంగా నార్పల విద్యాధికారి కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ గా విధులు నిర్వహిస్తున్నటువంటి రాజా విష్ణువర్ధన్ రెడ్డి జిల్లా విద్యాధికారి చేతుల మీదుగా ఉత్తమ కంప్యూటర్ ఆపరేటర్ అవార్డును అందుకున్నారు. విధి నిర్వహణలో అంకిత భావంతో విధులు నిర్వహించి అవార్డులు అందుకున్న ఎస్సై రాజశేఖర్ రెడ్డి కంప్యూటర్ పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు, సహచర ఉద్యోగులు, స్థానికులు ప్రత్యేక అభినందనలు తెలిపారు.

➡️