ముగిసిన చెస్‌ కోచింగ్‌ క్యాంప్‌

ముగిసిన చెస్‌ కోచింగ్‌ క్యాంప్‌

సైమల్టేనియస్‌ మ్యాచ్‌ ఆడుతున్న ఇంటర్నేషనల్‌ మాస్టర్‌ సాయి అగ్ని జీవితేష్‌

ప్రజాశక్తి-అనంతపురం

అనంతపురంలోని సాయినగర్‌ 2వ క్రాస్‌లో ఉన్న ఏ1 ఇన్సిట్యూట్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ వేదికగా ఈనెల 15వ తేదీ నుంచి నిర్వహించిన ఇంటర్నేషనల్‌ మాస్టర్‌ సాయి అగ్ని జీవితేష్‌ ఇంటెన్సీవ్‌ చెస్‌ కోచింగ్‌ క్యాంపు ఆదివారం విజయవంతంగా ముగిసింది. మొదటి నాలుగు రోజులు చదరంగానికి సంబంధించిన వివిధ అంశాల్లో క్రీడాకారులకు శిక్షణ ఇచ్చారు. చివరి రోజు ఇంటర్నేషనల్‌ మాస్టర్‌ సాయి అగ్ని జీవితేష్‌ 8 మంది క్రీడాకారులతో కూడా సైమల్టేనియస్‌ మ్యాచ్‌ (ఏక కాలంలో ఒక క్రీడాకారులు మిగిలిన అందరికీ క్రీడాకారులతో) ఆడగా, ఏడు మ్యాచ్‌లు సాయి అగ్ని జీవితేష్‌ గెలిచారు. కేవలం ఒక క్రీడాకారుడు కౌశిక్‌ చిల్లాతో జరిగిన గేమ్‌ మాత్రం డ్రాగా ముగిసింది. ఈ సందర్భంగా శిక్షణ శిబిరం నిర్వాహకులు ఇంటర్నేషనల్‌ ఆర్బిటర్‌ ఉదరుకుమార్‌ నాయుడు జిల్లాలో ఉన్న చదరంగం క్రీడాకారులు ఇలాంటి శిక్షణ శిబిరాలు ఎంతో ఉపయోగంగా ఉంటాయన్నారు. అంతేగాకుండా చదరంగం ఆట మెలకువలను మరింత మెరుగుపరుచుకుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాన్స్‌ మాస్టర్‌ వంశీకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

➡️