అల్లర్లకు పాల్పడొద్దు

గ్రామస్తులతో మాట్లాడుతున్న పోలీసులు

       అనంతపురం క్రైం : ఎన్నికల వేళ గ్రామాల్లో ఎలాంటి అల్లర్లకు పాల్పడకుండా ప్రశాంతంగా మెలగాలని పోలీసు అధికారులు సూచించారు. అనంతపురం జిల్లా ఎస్పీ అమిత్‌ బర్దర్‌ ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా సమస్యాత్మక గ్రామాల్లో పోలీసులు పల్లెనిద్ర చేస్తున్నారు. ఇందులో భాగంగా పలు గ్రామాల్లో డీఎస్పీలు, సిఐలు, ఎస్‌ఐలు పాల్గొని గ్రామస్తులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. సమస్యలుంటే పోలీసుల దష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకోవాలని సూచించారు. కేసుల్లో ఇరుక్కుపోయి జీవితాలు నాశనం చేసుకోవద్దని… ఆ ప్రభావం కుటుంబ సభ్యులపై ప్రభావం చూపుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. అర్హులైన ప్రతిఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. స్వేచ్ఛాయుత వాతావరణం కల్పిస్తాం నిర్భయంగా ఓటు వేయాలని తెలియజేశారు. అల్లర్లకు దిగితే కఠిన చర్యలుఎన్నికల సందర్భంగా అల్లర్లకు దిగితే కఠిన చర్యలు తప్పవని త్రీ టౌన్‌ సిఐ ధరణీ కిషోర్‌ హెచ్చరించారు. బుధవారం స్థానిక కొత్తూరు బాలుర జూనియర్‌ కళాశాలలో పోస్టల్‌ బ్యాలెట్‌ ఫెసిటేషన్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. గత రెండు రోజులుగా ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యాన్ని వినియోగించుకుంటున్నారు. ఇదే సమయంలో ఉద్యోగులను ప్రలోభాలకు గురి చేస్తున్నారని, బహిరంగంగా నగదు పంపిణీ జరుతోందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో గొడవలు జరుగుతాయనే ఉద్దేశంతో త్రీ టౌన్‌ పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

➡️