రోడ్లపైన విద్యుత్ స్తంభాలు

Feb 15,2024 12:19 #Anantapur District
Electric poles on roads

రోడ్ల మీద ఉన్న చెట్లను సైతం నేలమట్టం
ప్రజాశక్తి-పుట్లూరు : మండలంలో ప్రతి గ్రామానికి త్రీఫేస్ కరెంటు ఉండాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఆర్డీఎస్ స్కీం కింద త్రీ ప్లేస్ కరెంటు లాగుతున్నారు. ప్రభుత్వం నిబంధనల మేరకు రోడ్డు నుంచి నాలుగు మీటర్ల దూరంలో విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేయాల్సి ఉంది, నాలుగు అడుగులు కూడా లేకుండా రోడ్డు మీదనే పాతుతున్నారు. దీంతో ఉపాధి హామీ పథకం కింద అవన్నీ ప్లాంటేషన్ ద్వారా రోడ్డుకు ఇరువైపుల నాటిన చెట్లను సైతం నేలకు నరుకుతూ వెళ్తున్నారు. లక్షలు వెచ్చించి నాటిన చెట్లను విద్యుత్ స్తంభాల కోసం నరకడంతో రోడ్లు బోసిపోయాయి వాహనదారులు రోడ్లమీద వెళ్లాలంటే ఏం జరుగుతుందోనని ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకొని వెళ్లాల్సి వస్తుంది. గతంలో వివిధ ప్రాంతాలలో కరెంటు వైర్లు తెగి మృతి చెందిన సంఘటనలు ఉన్నాయి. గతంలో అగ్రికల్చర్ లైన్ ద్వారానే గ్రామాలలో సింగల్ ఫేస్ ట్రాన్స్ఫార్మర్లు పెట్టి కరెంటు వదులుతున్నారు. దీంతో గ్రామాల్లో త్రీఫేస్ కరెంటు లేకపోవడం వలన గ్రామాలలో త్రాగునీటి సమస్య వస్తున్నదని దీంతో జల జీవన్ మిషన్ క్రింద ఇంటింటికి కులాయికి తీవ్ర ఇబ్బంది కలుగుతున్నది అన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఆర్డీఎస్ క్రీమ్ కింద ప్రతి గ్రామా త్రీ ఫేస్ కరెంటు లాగుతున్నారు. రోడ్డుమీద నే కరెంట్ స్తంభాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రోడ్ల పైన నాటిన స్తంభాలను తొలగించి రోడ్డుకు నాలుగు మీటర్ల దూరంలో ఏర్పాటు వాహనదారులు కోరుకుంటున్నారు.

➡️