ఒంటిబ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

ప్రజాశక్తి-ఒంటిమిట్టఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఈ నెల 317 నుంచి 25వ తేదీ వరకు జరుగనున్న వార్షిక బ్రహ్మో త్సవాలకు మంగళవారం రాత్రి శాస్త్రో క్తంగా అంకురార్పణ జరిగింది. ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి మూలవర్లకు వ్యాసాభిషేకం, ఆరాధన, అర్చన చేశారు. సాయంత్రం ఆరు నుండి 8 గంటల వరకు వేదపండితులు, అర్చకులు వేదమంత్రాల నడుమ శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు. బాజాభజంత్రీలు నడుమ వేదపండితుల మంత్రోచచరణ్లలతో అంకురార్పణం చేశారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు హారతి ఇచ్చారు. కేరళ వాయిద్యకారులు ప్రదర్శన పలువురిని ఆకట్టుకొంది. బ్రహోత్సవాలలో ప్రతి రోజు ఉదయం 7.30 నుండి 9.30 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు వాహన సేవలు జరుగుతాయి. కార్యక్రమంలో టిటిడి డిప్యూటి ఇఒలు నటేష్‌బాబు, ప్రశాంతి, సూపరింటెండెంట్‌ హనుమంతయ్య, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ నవీన్‌, ఆలయ ప్రధాన అర్చకులు, వేద పండితులు పాల్గొన్నారు. నేడు ధ్వజారోహణం ఈ నెల 17న ఉదయం 10.30 నుంచి 11 గంటలకు మిథునలగంలో ధ్వజారోహణం ఉంటుంది. సాయంత్రం 4 నుంచి రాత్రి 7 గంటల వరకు పోతన జయంతి, కవి సమ్మేళనం కార్యక్రమాలు నిర్వహిస్తారు. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు శేష వాహనంపై శ్రీ సీతారామలక్ష్మణులు భక్తులకు దర్శనమిస్తారు.22న శ్రీ సీతారాముల కల్యాణం ఏప్రిల్‌ 22వ తేదీన రాత్రి 6.30 నుంచి 8.30 గంటల వరకు సీతారాముల కల్యాణం వేడుకగా నిర్వహిస్తారు. ప్రజలు రూ.750 చెల్లించి కల్యాణంలో పాల్గొనవచ్చు. వీరికి ఒక ఉత్తరీయం, రవికె, లడ్డూ ప్రసాదం బహుమానంగా అందజేస్తారు. ఆ తరువాత తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు.అర్చకులు వేద మంత్రాల నడుమ శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు. బాజాభజంత్రీలు నడుమ వేద పండితుల మంత్రోచచరణ్లలతో అంకురార్పణం చేశారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వ హించారు హారతి ఇచ్చారు. కేరళ వాయిద్య కారులు ప్రదర్శన పలువురిని ఆకట్టుకొంది. బ్రహోత్సవాలలో ప్రతి రోజు ఉదయం 7.30 నుండి 9.30 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు వాహన సేవలు జరు గుతాయి. కార్యక్రమంలో టిటిడి డిప్యూటి ఇఒలు నటేష్‌బాబు, ప్రశాంతి, సూపరి ంటెండెంట్‌ హనుమంతయ్య, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ నవీన్‌, ఆలయ ప్రధాన అర్చకులు, వేద పండితులు పాల్గొన్నారు. నేడు ధ్వజారోహణం ఈ నెల 17న ఉదయం 10.30 నుంచి 11 గంటలకు మిథునలగంలో ధ్వజా రోహణం ఉంటుంది. సాయంత్రం 4 నుంచి రాత్రి 7 గంటల వరకు పోతన జయంతి, కవి సమ్మేళనం కార్యక్రమాలు నిర్వహిస్తారు. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు శేష వాహనంపై శ్రీ సీతారామలక్ష్మణులు భక్తులకు దర్శనమిస్తారు.22న శ్రీ సీతారాముల కల్యాణం ఏప్రిల్‌ 22వ తేదీన రాత్రి 6.30 నుంచి 8.30 గంటల వరకు సీతారాముల కల్యాణం వేడుకగా నిర్వహిస్తారు. ప్రజలు రూ.750 చెల్లించి కల్యాణంలో పాల్గొనవచ్చు. వీరికి ఒక ఉత్తరీయం, రవికె, లడ్డూ ప్రసాదం బహుమానంగా అందజేస్తారు. ఆ తరువాత తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు.

➡️