తాసిల్దారు హత్య దారుణం 

Feb 3,2024 12:36 #Annamayya district
mro staff protest against mro murder

నల్ల బ్యాడ్జీలతో రెవెన్యూ అధికారుల నిరసన 
ప్రజాశక్తి-రైల్వేకోడూరు : విశాఖపట్నంలో తాసిల్దారు రమణయ్య హత్య అత్యంత దారుణమని ఇన్చార్జి తాసిల్దారు అమరేశ్వరి అన్నారు. శనివారం ఉదయం తాసిల్దార్ కార్యాలయం వద్ద రెవెన్యూ అధికారులు సిబ్బంది నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా అమరేశ్వరి మాట్లాడుతూ ఒక మండల మెజిస్ట్రేట్ గా ఉన్న తాసిల్దారు మండలంలో ప్రజల కొరకు అహర్నిశలు పాటుపడుతూ అందుబాటులో ఉంటారని అలాంటి అధికారిని అత్యంత దారుణంగా హత్య చేయడం అమానుషమని, హత్య చేసిన వారిని గుర్తించి కఠిన శిక్ష వేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో రీ సర్వే డిప్యూటీ తాసిల్దారు మానస, ఆరాయి రాజశేఖర్, సీనియర్ అసిస్టెంట్ మల్లికార్జున రెడ్డి, కంప్యూటర్ ఆపరేటర్ వెంకట సాయి రాఘవేంద్ర, జూనియర్ అసిస్టెంట్ రుత్విక్ హర్ష, ఏఎస్ఓ షణ్ముగం, వీఆర్వోలు భారతి, చాన్ బాషా, నిరంజన్, వీఆర్ఏలు తదితరులు పాల్గొన్నారు.

➡️