అక్రమ అరెస్టులను ఖండిస్తూ నిరసన

Jan 22,2024 16:48 #Annamayya district

ప్రజాశక్తి-బి.కొత్తకోట:  అక్రమ అరెస్టులను ఖండిస్తూ సోమవారం బి కొత్తకోటలో జ్యోతి చౌక్ నందు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రభుత్వం అంగన్వాడీల అక్రమ అరెస్టులు నిర్బంధాలను వెంటనే ఆపాలి. అరెస్ట్ చేసిన కార్మిక సంఘాల నేతలను అంగన్వాడీలను వెంటనే విడుదల చేయాలని, జీవో నెంబర్ 2ను ఏస్మా చట్టాన్ని రద్దు చేసి, కనీస వేతనాలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేసారు. గత 42 రోజులుగా అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని సమ్మె చేస్తున్న అంగన్వాడీలను, కార్మిక సంఘాల నేతలను సోమవారం తెల్లవారుజామున విజయవాడ లో అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, ప్రభుత్వం అక్రమ అరెస్టులు, నిర్బంధాలు ఆపాలని, అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని, అంగన్వాడీలపై ఎస్మా చట్టం జీవో నెంబర్ 2 రద్దు చేయాలని ఏఐటీయూసీ తంబళృపల్లి నియోజకవర్గం అధ్యక్షులు ఎస్. సలీం భాష కార్యదర్శి , బి. వేణుగోపాల్ రెడ్డి జి రఘునాథ్ డిమాండ్ చేశారు.

అక్రమ అరెస్టులను ఖండిస్తూ

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికార దాహంతో అధికారంలోకి వచ్చాక తెలంగాణ కన్నా అదనంగా వెయ్యి రూపాయలు వేతనం పెంచుతామని చెప్పిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక అంగన్వాడీలను రోడ్లపాలు చేశాడని నాడు ఇచ్చిన హామీలు అమలు చేయమంటే తొలగిస్తామంటూ బెదిరింపులకు పాల్పడం దుర్మార్గం అన్నారు. సోమవారం తెల్లవారుజామున విజయవాడ ధర్నా చౌక్ లో పోలీసులు అంగన్వాడీల దీక్షా శిబిరంలో చొరబడి కరెంట్ బంద్ చేసి, టెంట్లు కూలదోసి అంగన్వాడీలను బలవంతంగా మహిళా పోలీసులు లేకుండా మగ పోలీసులు అంగన్వాడీలను బలవంతంగా అరెస్టు చేయడాన్ని ఖండించారు. మొన్న విజయవాడ లో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన జగన్ రెడ్డీ రాజ్యాంగ బద్దంగా సమ్మె చేస్తుంటే రాజ్యాంగ విరుద్ధంగా అంగన్వాడీల పట్ల కక్షపూరితంగా వ్యవహరించడం దుర్మార్గమైన చర్య అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అక్రమ అరెస్టులు నిర్బంధాలను వెంటనే ఆపాలని అంగన్వాడి ఉద్యోగులకు కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని , గ్రాట్యుటీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో సీఎం ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కార్మికు శ్రమ దోపిడీ చేస్తున్నారని విమర్శించారు. అంగన్వాడి ఉద్యోగుల న్యాయమైన సమస్యలు పరిష్కరాచాలని లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ఉదృతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ మండల కార్యదర్శి జి రఘునాథ్, ఏఐటీయూసీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ కె బాలకృష్ణ, సిపిఐ పట్టణ కార్యదర్శి ఎం అష్రఫ్ అలీ, ఏఐటీయూసీ నాయకులు గంగులప్పా బాబు, రియాజ్, తదితరులు పాల్గొన్నారు.

➡️