మైనారిటీ మండల అబ్జర్వర్లుగా హమీద్‌ భాష, షేక్‌ ఇబ్రహీం నియామకం

ప్రజాశక్తి -రాజమహేంద్రవరం రూరల్‌ : రాజమహేంద్రవరం వైసిపి పార్లమెంట్‌ నియోజకవర్గ అభ్యర్థి గూడూరి.శ్రీనివాస్‌ ఆదేశాల మేరకు తూర్పుగోదావరి జిల్లా మైనారిటీ విభాగం అధ్యక్షులు ఎండి.వజీరుద్దీన్‌ సూచనల మేరకు పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీకి సేవలందిస్తున్న ఎండి హమీద్‌ బాషా, ఎస్‌కె.ఇబ్రహీం బాషా లను రాజమహేంద్రవరం పార్లమెంటు నియోజకవర్గం మైనారిటీ సెల్‌ మండలాల అబ్జర్వర్స్‌ గా నియమించారు. అబ్జర్వర్లుగా నియమితులైన ఈ ఇద్దరిని గూడూరి.శ్రీనివాస్‌ కుమారులు గూడూరి .భారతి రామ్‌ అభినందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనారిటీ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ షేక్‌ నిజాం, తూర్పుగోదావరి జిల్లా వక్ఫ్‌ బోర్డు అధ్యక్షులు ఎండి ఆరిఫ్‌, తూర్పుగోదావరి జిల్లా మైనారిటీ విభాగం ఉపాధ్యక్షులు ఎండి రమీజ్‌, రాజమహేంద్రవరం సిటీ అధికార ప్రతినిధి ఎండి షబ్బీర్‌ పాల్గొని హమిద్‌ బాషా ను ఇబ్రహీం బాషా ను అభినందించారు.

➡️