ఆడుదాం ఆంధ్ర క్రీడా పరికరాలు పంపిణీ

Dec 2,2023 10:34 #Kakinada
atadukundam andhra material

ప్రజాశక్తి – తాళ్లరేవు : ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న క్రీడలకు సంబంధించి మండలంలోని 24 సచివాలయాలకు క్రీడా సామాగ్రిని ఎంపీపీ రాయుడు సునీత గంగాధర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తాళ్లరేవు మండల పరిషత్ లో ఆమె మాట్లాడారు. ఈనెల 15వ తేదీ నుంచి ఆడుదాం ఆంధ్రాలో భాగంగా గ్రామస్థాయిలో వాలీబాల్, బ్యాడ్మింటన్, టెన్ని కాయిట్, క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గ్రామస్థాయిలో విజేతలు మండల స్థాయి, మండల స్థాయి విజేతలు, జిల్లా, రాష్ట్రస్థాయిలో పాల్గొంటారన్నారు. ఆయా స్థాయిలలో విజేతలకు ప్రభుత్వం నగదు బహుమతితో పాటు క్రీడా ట్రోఫీలు అందజేస్తారని అన్నారు. ఈ అవకాశాన్ని 15 సంవత్సరాలు దాటిన యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఎం.అనుపమ, ఈవో పి ఆర్ ఆర్ డి మల్లాడి భైరవ మూర్తి, మోహన్ కృష్ణ, ఆయా సచివాలయాల కార్యదర్శులు సిబ్బంది పాల్గొన్నారు.

➡️