అవయవ దానంపై అవగాహన

Jun 30,2024 19:54
అవయవ దానంపై అవగాహన

అవయవ దానంపై అవగాహన కల్పిస్తున్న దృశ్యం
అవయవ దానంపై అవగాహన
ప్రజాశక్తి-కందుకూరు : మానవ శరీర అవయవాలను, కణజాలాన్ని మార్చగలడం వైద్యరంగం సాధించిన విప్లవాత్మకమైన చర్య అని పలువురు పేర్కొన్నారు. ఆదివారం నేత్ర,అవయవ, శరీర దాన అవగాహన సదస్సులో పాల్గొన్న అమ్మ నేత్ర, అవయవ,శరీరదాన ప్రోత్సాహకుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు గంజి ఈశ్వర లింగం మాట్లాడారు. కందుకూరు స్కందపురి జనార్ధన స్వామి దేవాలయం కళ్యాణమండపంలో జరిగిన ఈ సదస్సులో పాల్గొన్న గంజి ఈశ్వర లింగం మాట్లాడుతూ దేశంలో లక్షలాదిమంది కార్నియా సమస్యతో బాధపడుతూ కంటి చూపు లేకుండా జీవిస్తున్నారన్నారు. వారికి మరణించిన వ్యక్తి యొక్క కార్నియాను తీసి అమర్చుట ద్వారా తిరిగి చూపును ప్రసాదించవచ్చని అన్నారు. న్యాయవాది ముప్పవరపు కిషోర్‌ మాట్లాడుతూ శరీర దానం చేయాలనుకున్న వ్యక్తి తన వ్యక్తిగత అంగీకారంతో పాటు కుటుంబ పరమైన అంగీకారం కూడా తీసుకోవాల్సి ఉందన్నారు. ఈ కార్యక్రమానికి ఉపాసికలు గాండ్ల హరిప్రసాద్‌ అధ్యక్షత వహించారు ఆయన తన శరీరాన్ని దానం చేస్తూ అంగీకార పత్రమును అందించడం జరిగినది. ఆయనతోపాటు షేక్‌ నబీషా, షేక్‌ అహ్మద్‌, చనమాల బాలాజీ తదితరులు తమ నేత్ర, అవయవ, శరీర దానాలను చేయుటకు సంసిద్ధం వ్యక్తపరిచారు. ఇప్పటినుండి దమ్మచక్ర ఫౌండేషన్‌ ద్వారా అవేర్నెస్‌ ప్రోగ్రామ్స్‌, కౌన్సిలింగు క్లాసులు నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్‌ జీవనాధార సంస్థకు నేత్ర, అవయవ,శరీర దానాలను చేసిన వారి వివరాలను అందిస్తామని ప్రముఖ జియాలజిస్టు పి శేషగిరిరావు తెలిపారు. రావులకొల్లు బ్రహ్మానందం, డాక్టర్‌ తన్నీరు మలి ్లకార్జున, చనమాల కోటేశ్వరరావు, ముతకాని లక్ష్మీనారాయణ, పోకూరి కోటయ్య, షేక్‌ సలాం ఉన్నారు.

➡️