ఇసుకలో శవం

Apr 12,2024 15:11 #Bapatla District

ఈపురిపాలెం పద్మనాభుని పేటలో ఘటన
ఇంటి యజమానిరాలు ఫిర్యాదు దర్యాప్తు చేపట్టిన పోలీసులు

ప్రజాశక్తి – చీరాల : అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట లేకపోవడంతో ఇసుక మాఫియా దారులు యదేచ్ఛగా సమాధులను సైతం వదలకుండా అర్ధరాత్రి వేళలో శవాలను సైతం చూసుకోకుండా ఇసుక వ్యాపారం ఇష్టా రాజ్యాంగా చేస్తున్నారు. ఇంటి నిర్మాణం కోసం ఇసుక తోలించుకుంటే శవం బయటపడిందని ఇంటి యజమానురాలు పోలీసులకు ఫిర్యాదు ఇచ్చిన ఘటన మండలంలోని ఈపురిపాలెం పద్మనాభంపేటలో శుక్రవారం వెలుగు చూసింది.అందిన వివరాల మేరకు.. ఈపురిపాలెం పద్మనాబుని పేటలో నివాసముంటున్న కాగితాల లక్ష్మి నూతనంగా నిర్మిస్తున్న తన ఇంటి నిర్మాణం చేపట్టింది. అయితే ఇంటి బేస్ మట్టం ఫీల్ చేసేందుకు ఇసుక అవసరం అవటంతో ట్రాక్టర్ డ్రైవర్లకు కోరింది. దీంతో ఇసుక దళారులు అక్రమంగా బోయినవారిపాలెం గ్రామ శివారులోని సమాధులలో ఇసుకను అక్రమంగా జెసిబి ద్వారా తరలిస్తూ డబ్బులు దండుకుంటున్నారు. అయితే ఇసుక అక్రమ రవాణా చేస్తున్న తరుణంలో గురువారం అర్ధరాత్రి సమాధుల్లో ఇసుకను జెసిబితో తీసి ట్రాక్టర్ సహాయంతో ఇసుక రవాణా చేశారు.అన్లోడ్ చేసిన ట్రాక్టర్ డ్రైవర్ మత దేహాన్ని గమనించక ఇసుకను దిబ్బగా వేసి వెళ్లిపోయారు. ఇంటి పని కోసం వచ్చిన బేల్దారి కూలీలు బేస్ మట్టాన్ని ఇసుకతో నింపేందుకు ఇక తవ్వుతుండగా ఒక్కసారిగా అందులోనుండి అంత దేహం బయటపడింది. దీంతో భయభ్రాంతులకు గురైన కూలీలు విషయాన్ని ఇంటి నిర్వాహలకు తెలియజేశారు. జరిగిన తంతును ఇంటి నిర్వాహకురాలు లక్ష్మి పోలీసులకు సమాచారం అందించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బయటపడ్డ మృతదేహం రోజులు వ్యవది అని అపై వికలాంగునిది కావడం, మొండెం మాత్రమే ఉండటంతో జెసిబితో ఇసుకతోలే క్రమంలో తల ఊడిపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు. అందిన పిర్యాదు మేరకు రూరల్ నిమ్మగడ్డ ప్రసాదు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహం ఎక్కడిది? అసలు ఇసుక ఎక్కడ నుండి తరలించారు? ఏం జరిగింది? అనే వివరాలు సేకరిస్తున్నారు. ఈమెరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

➡️