అన్నదానం పేదలకు వరం

May 28,2024 23:41 ##Vetapalem #Rotary

ప్రజాశక్తి – వేటపాలెం
రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో జాండ్రపేట గంగా బ్రమరాంబ సమేత నాగలింగేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం అన్నదానం చేశారు. సినీ డైరెక్టర్ ఆర్‌కె నల్లూరి మాట్లాడుతూ అన్నదానం చేస్తున్న రోటరీ క్లబ్ ప్రతినిధులను అభినందించారు. భవిష్యత్తులో రోటరీ క్లబ్‌కు అవసరమైన సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయనను రోటరీ క్లబ్ ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. 60మంది నిరుపేదలకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో రోటరీ అధ్యక్షులు బట్ట మోహనరావు, కార్యదర్శి ఎవి సురేష్ బాబు, సేవా తత్పరులు కాలేశ్వరరావు, సీతారామయ్య, సప్రం రోహిణి కుమార్ పాల్గొన్నారు.

➡️