అభివృద్ధి పనులు పరిశీలించిన బలరాం

Mar 2,2024 23:25

ప్రజాశక్తి – వేటపాలెం
అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తి చేయాలని తాజా మాజీ ఎంఎల్‌ఎ కరణం బలరామకృష్ణమూర్తి అధికారులను ఆదేశించారు. మండలంలోని దేశాయిపేట, జాండ్రపేట, రామకృష్ణాపురం పంచాయతీల పరిధిలో అభివృద్ధి పనులను ఆయన శనివారం పరిశీలించారు. సత్వరమే అరకొరగా ఆగి ఉన్న పనులను పూర్తి చేయాలని అన్నారు. పూర్తి చేసిన దేశపేట సచివాలయం పరిశీలించి సూచనలు చేశారు. జాండ్రపేట, రామకృష్ణాపురం పంచాయతీల్లో స్థానిక నాయకులతో మాట్లాడి సత్వర చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో పంచాయితీ రాజ్ డిఈ శేషయ్య, వైసిపి మండల అధ్యక్షులు బొడ్డు సుబ్బారావు, జెసిఎస్ మండల ఇంచార్జీ లేళ్ల శ్రీధర్ పాల్గొన్నారు.

➡️