సిఎం సహాయనిధి చెక్కులు పంపిణీ

Mar 15,2024 00:15

ప్రజాశక్తి – పంగులూరు
మండలంలోని పలువురికి సిఎం సహాయనిధి చెక్కులను వైసీపీ నాయకులు గురువారం పంపిణీ చేశారు. అలవలపాడు గ్రామానికి చెందిన పేర్ల జయరామయ్యకు సిఎం సహాయనిధి కింద మంజూరైన రూ.46వేల విలువైన చెక్కును వైసీపీ మండల ఇన్చార్జి బిజ్జం శ్రీనివాసరెడ్డి అందజేశారు. షేక్ జుబేర్‌కు రూ.26వేలు, నూజిల్లపల్లి గ్రామానికి చెందిన కొల్లి ఆంజనేయులుకు రూ.20వేలు, బూదవాడ గ్రామానికి చెందిన పులిఖండం అంజమ్మకు రూ.23వేల చెక్కును అందజేశారు. కార్యక్రమంలో వైసీపీ మండల కన్వీనర్ స్వయంపు హనుమంతరావు, నాయకులు గాదే బ్రహ్మారెడ్డి పాల్గొన్నారు.

➡️