వృద్ధులకు పండ్లు పంపిణీ

Jan 27,2024 00:56

ప్రజాశక్తి – కారంచేడు
ఎంఎల్‌ఎ ఏలూరి సాంబశివరావు జన్మదినం సందర్భంగా స్థానిక విశ్వా మిత్రా వృద్ధాశ్రమంలోని వృద్ధులకు టిడిపి సీనియర్ నాయకులు యార్లగడ్డ అక్కయ్యా చౌదరి, టిడిపి అధ్యక్షుడు కంభంపాటి నరేంద్ర ఆధ్వర్యంలో పండ్లు, రొట్టెలు శుక్రవారం పంపిణీ చేశారు. ముందుగా స్థానిక టిడిపి కార్యాలయంలో జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ కేక్ కట్ చేసి పంచిపెట్టారు. రానున్న ఎన్నికల్లో ఘన విజయం సాధించేందుకు కార్యకర్తలు కృషి చేయడమే ఏలూరికి ఇచ్చే బహుమతి అన్నారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు ఆదిలక్ష్మి, వెంకటేష్, విలేఖరి శ్రీను. గద్దె సుబ్బయ్య, కొల్ల భాస్కరరావు, పేర్ని సీతారామ్నజనేయులు, బొడావుల గన్, రామచంద్రరావు, శివ బాబు, తాడిశెట్టి రవి, మస్తాన్ వలి, యార్లగడ్డ ఉదయ భాస్కరరావు, దగ్గుబాటి వెంకన్న, యార్లగడ్డ సాయి పాల్గొన్నారు.

➡️