అపోహలొద్దు. టిడిపి టికెట్ నాకే : కొండయ్య

Feb 24,2024 23:34

– 30 వేల మెజారిటీతో గెలుస్తా
– నాయకులు కార్యకర్తలు అధైర్య పడవద్దు
– చివరి జాబితాలోనైనా అధిష్టానం ప్రకటిస్తుంది
ప్రజాశక్తి – చీరాల
టిడిపి అధ్యక్షులు చంద్రబాబు ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్ధుల తొలి జాబితాలో తన పేరు లేకపోవడంపై నాయకులు, కార్యకర్తలు ఎవరు అపోహ పడవద్దని, అధిష్టానం టిక్కెట్టు తనకే ప్రకటిస్తుందని టిడిపి ఇన్చార్జి ఎంఎం కొండయ్య చెప్పారు. టిడిపి అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించిన నేపథ్యంలో స్థానిక టిడిపి కార్యాలయంలో ఆయన విలేకరులతో శనివారం మాట్లాడారు. అధిష్టానం తనను చీరాల ఇంచార్జిగా బాధ్యతలు అప్పగించినప్పటి నుండి పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళుతూ టిడిపి బలోపేతానికి ఎంతగానో కృషి చేశానని అన్నారు. తన కష్టాన్ని గుర్తించిన అధిష్టానం తప్పకుండా తనకు సీటు కేటాయిస్తుందని తెలిపారు. గతంలో నియోజకవర్గ ముఖ్య నేతల సమక్షంలో తనతో చంద్రబాబు స్పష్టమైన హామీ ఇచ్చారని గుర్తు చేశారు. వైసీపీ ప్రభుత్వంలో ప్రజలు విసిగిపోయారని అన్నారు. ప్రస్తుతం ప్రజలు చంద్రబాబును విశ్వసిస్తున్నారని అన్నారు. సూపర్ సిక్స్ మేనిఫెస్టో ప్రజలకు ఎంతగానో మేలు చేస్తుందని అన్నారు. చీరాలలో టిడిపి మంచి ఆదరణ ఉందని, తన గెలుపుకు ప్రజలందరూ సహకరిస్తారని అన్నారు. 30వేల మేజార్టీతో టిడిపి జెండా ఎగరవేస్తానని ధీమా వ్యక్తం చేశారు. ప్రతి ఎన్నికల్లో చీరాల అభ్యర్థి సీటు చివరి క్షణంలో ప్రకటిస్తారనే విషయం ప్రజలందరికీ తెలుసని అన్నారు. అయితే కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. అధిష్టానం చివరి జాబితాలోనైనా తన పేరు ప్రకటిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. సమావేశంలో టిడిపి పట్టణ అధ్యక్షులు గజవల్లి శ్రీనివాసరావు, కౌతవరపు జనార్ధన్, డేటా నాగేశ్వరరావు, పార్థసారథి, పురుషోత్తం, సురేష్ పాల్గొన్నారు.

➡️