పచ్చిరొట్ట ఎరువలతో భూమి సారవంతం

May 22,2024 23:51

ప్రజాశక్తి – కొల్లూరు
స్థానిక వ్యవసాయ అధికారి కార్యాలయంలో మట్టి నమూనాల సేకరణ అవగాహన, పచ్చి రొట్ట ఎరువుల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. బాపట్ల వ్యవసాయ శిక్షణ కేంద్రం వ్యవసాయ అధికారి ఆర్ విజయ బాబు పచ్చి రొట్ట ఎరువుల ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎఒ ఆర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జనుము, పిల్లి పెసర విత్తనాలు మండలంలోని అన్ని ఆర్‌బికెల్లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రైతులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఆర్‌బికె వ్యవసాయ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

వేటపాలెం : నేల సారం పెంచుకోవడానికీ పచ్చిరోట్ట విత్తనాలు సాగు చేయడం ఎంతో ఉపయోగంగా వుంటుందని ఎఒ ఐ కాశీ విశ్వనాథం తెలిపారు. మండలంలోని చల్లారెడ్డిపాలెం-2 రైతు భరోసా కేంద్రంలో పచ్చి రొట్ట విత్తనాలు బుధవారం పంపిణీ చేశారు. రైతులకు 50శాతం సబ్సిడీపై పచ్చిరొట్ట విత్తనాలు అందజేసేందుకు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం మండలానికి జీలుగ-27 క్వింటళ్లు, పిల్లి పెసర-20 క్వింటళ్లు, జనుము-9 క్వింటళ్లు కేటాయించినట్లు తెలిపారు. ఆర్‌బికెలో జీలుగ 3.5 క్వింటాళ్లు, పిల్లిపెసర 5క్వింటాళ్లు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఆయా ప్రాంతాల రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
పర్చూరు : రైతులకు అవసరమైన పచ్చి రొట్టె ఎరువులు సబ్సిడీపై ఇచ్చేందుకు రైతు భరోసా కేంద్రాల్లో అందుబాటులో ఉన్నట్లు ఎఒ ఎస్ రామ్మోహనరెడ్డి తెలిపారు. పచ్చి రొట్ట ఎరువుల వాడకం వల్ల భూమి సారవంతం అవుతుందని తెలిపారు. తద్వారా నాణ్యమైన దిగుబడులు పొందేందుకు ఎంతగానో దోహద పడతాయని తెలిపారు. 50శాతం సబ్సిడీపై అందించే విధంగా భరోసా కేంద్రంలో సిద్ధం చేసినట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

➡️