ప్రొద్దుటూరులో దారుణహత్య

Jun 24,2024 14:57 #Brutal murder, #Kadapa

ప్రొద్దుటూరు (కడప జిల్లా) : ప్రొద్దుటూరు వైఎంఆర్‌ కాలనీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి ఇంటి ఎదురుగా సోమవారం దారుణహత్య జరిగింది. భూమిరెడ్డి రామచంద్రారెడ్డి అనే వ్యక్తి వెంకట మహేశ్వర్‌ రెడ్డి అనే వ్యక్తిని హత్య చేసి శవాన్ని మాయం చేశాడు. మృతుడి తల్లి నాగరత్నమ్మ, రామచంద్రా రెడ్డి కొంతకాలంగా సహజీవనం చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈరోజు తెల్లవారేసరికి వెంకట మహేశ్వర్‌ రెడ్డి గదిలోనూ మంచంపై రక్తపు మరకలు ఉండటంతో మృతుడి తల్లి పోలీసులను ఆశ్రయించింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

➡️