మీ ఆడబిడ్డను.. ఆదరించండి

ప్రజాశక్తి-యర్రగొండపాలెం: ‘యర్రగొండపాలెం నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా రెండుసార్లు పోటీ చేసి నాయకులు చేసిన మోసానికి తీవ్రంగా నష్టపోయా.. అయినా నా వెంట నడిచిన కార్యకర్తలకు అండగా ఉండాలనే ఉద్దేశంతో మూడోసారి కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నా.. మీ ఆడబిడ్డగా ఆదరించండి..’ అని బూదాల అజితారావు అన్నారు. శుక్రవారం యర్రగొండపాలెం మండలంలోని గంగపాలెం గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తుందని తెలిపారు. ప్రత్యేక హోదా వస్తే నియోజకవర్గం మరింత అభివృద్ధి చేసుకోవచ్చని అన్నారు. తనను గెలిపిస్తే ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రతి సమస్యను తన సమస్యగా భావించి పరిష్కరించేం దుకు కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు వెంకటరెడ్డి, నాసరయ్య, సూరి, పుచ్చకాయల వెంకటేశ్వర్లు చౌదరి, విజయకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️