అంగన్వాడీల అరెస్టులు దారుణం

Jan 22,2024 22:47
అంగన్వాడీల అరెస్టులు దారుణం

అంబేద్కర్‌ విగ్రహం ఎదుట ప్రజాసంఘాల నిరసన
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: అంగన్వాడీల అరెస్టులను నిరశిస్తూ సిపిఎం, సిపిఐ, ఏఐటీయూసీ, సిఐటియు నేతలు సోమవారం స్థానిక అంబేద్కర్‌ విగ్రహం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈసందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు పి.చైతన్య, ఏఐటియుసి జిల్లా నాయకులు దాసరి చంద్ర మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్లు న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం గత 43 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తూ, దీక్షలు చేపడుతున్న వారి న్యాయమైన సమస్యలను పరిష్కరించకపోగా ఉద్యమాన్ని నిర్వీర్యం చేయడానికి జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం, జీవో నెంబర్‌ 2ను ఉపయోగించి ఏస్మా చట్టాన్ని ప్రయోగించి కార్యకర్తలను భయభ్రాంతులను చేసి విధుల నుండి తొలగించడానికి పూనుకోవడమే కాకుండా పోలీసులను రెచ్చగొట్టి ఉద్యమాన్ని నిర్మించడానికి అంగన్వాడీ కార్యకర్తలను వేలపాలలేక గహనిర్బంధాలు చేయడం, అక్రమ అరెస్టులను చేయడం దుర్మార్గమని, భారత రాజ్యాంగం రచించిన బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ విగ్రహాన్ని 125 అడుగుల పెట్టడం గొప్ప కాదు ఆ మహా పురుషుడు రాసిన రాజ్యాంగాన్ని చట్టాన్ని ఆశయాలను అమలు చేయకుండా తుంగలో తొక్కుతున్నారని విమర్శించారు. ఇప్పటికైనా అంగన్వాడీ వర్కర్ల సమస్యలను పరిష్కరించకపోతే 24వ తేదీ నుండి రాష్ట్రవ్యాప్తంగా కార్మిక సంఘాల, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో రాష్ట్రబంద్‌ చేపడుతున్నట్లు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్‌.నాగరాజు సిపిఎం జిల్లా నాయకులు కాంచీపురం సురేంద్రన్‌, సిపిఐ నగరకార్యదర్శి విసి.గోపీనాథ్‌, ఏఐటియుసి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.రమాదేవి నాయకులు లతారెడ్డి, చంద్రయ్య పాల్గొన్నారు.

➡️