అర్హతే కొలమానంగా సంక్షేమం: పెద్దిరెడ్డి

Dec 25,2023 00:15
అర్హతే కొలమానంగా సంక్షేమం: పెద్దిరెడ్డి

ప్రజాశక్తి-చౌడేపల్లి: అర్హతే కొలమానంగా ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి చేకూరుస్తున్నట్లు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఆదివారం మండలంలో రూ.13కోట్లతో నిర్మించిన వివిద ప్రభుత్వ నూతన కార్యాలయాలను ప్రారంభించారు. 30ఏళ్లుగా చవిచూడని అభివృద్ధిని పుంగనూరు నియోజకవర్గ ప్రజలు ఈ నాలుగేళ్లలో చూశారని ఆయన అన్నారు. మారు మూల ప్రాంతాలకు కూడా రోడ్డు ఏర్పాటు చేసినట్లు వివరించారు. పరికిదొన, గడ్డంవారిపల్లి, కోటూరు, వెంగళపల్లి, 29.ఎ చింతమాకులపల్లి, కొండయ్యగారిపల్లి, చారాల, దుర్గసముద్రము, దాదేపల్లి, ఎ.కొత్తకోటలలో ఆర్‌.ఓ.ప్లాంట్‌లను, కొండామర్రి, బిల్లేరు, దుర్గసముద్రములలో 3 విద్యుత్‌ సబ్‌స్టేషన్‌లను, వెంగళపల్లి, కాటీపేరి, లద్దిగం, 29-ఎ- చింతమాకులపల్లి లలో 4 రైతు భరోసా కేంద్రలను, కాటిపేరి, 29.ఎచింతమాకులపల్లి, చౌడేపల్లి, దుర్గసముద్రములలో 4 వైఎస్సార్‌ హెల్త్‌సెంటర్‌లను, గడ్డంవారిపల్లిలో రూ.17.5 లక్షలతో నిర్మించిన బి.యం.సి.యును, లద్దిగంలో రూ.16.00లక్షలతో డిజిటల్‌ లైబ్రరీను, పెద్ద ఎల్లకుంట్లలో రూ.43.80 లక్షలతో గ్రామ సచివాలయాలను మంత్రి ప్రారంభించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ ప్రభాకర్‌రెడ్డి, ఎస్పీడీసీఎల్‌ ఎస్‌ఈ కష్ణారెడ్డి, డిపిఓ లక్ష్మి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మురళీ కష్ణ, ఎంపీపీ రామమూర్తి, జెడ్పీటిసి దామోదరరాజు, బోయకొండ గంగమ్మ పాలక మండలి చైర్మన్‌ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

➡️