ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగుల సమ్మెకు యుటిఎఫ్‌ మద్దతు

ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగుల సమ్మెకు యుటిఎఫ్‌ మద్దతు

ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగుల సమ్మెకు యుటిఎఫ్‌ మద్దతుప్రజాశక్తి- చౌడేపల్లి: సమగ్ర శిక్ష అభియాన్‌లో పనిచేస్తున్న ఉద్యోగుల పట్ల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పాటించాలని యుటిఎఫ్‌ జిల్లా కార్యదర్శి జగన్మోహన్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. స్థానిక ఎంఆర్సి భవనం వద్ద ఎస్‌ఎస్‌ సిబ్బంది తలపెట్టిన సమ్మెకు మద్దతు తెలిపారు. ఎస్‌ఎస్‌ఏలో ఉద్యోగ బాధ్యతలు చేపడుతున్న వారిని క్రమబద్ధీకరించాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. గత 15 రోజులుగా సమ్మె చేస్తున్న ఎస్‌ఎస్సికి రూ.15116లు ఆర్థిక సాయం చేశారు. యుటిఎఫ్‌ మాజీ మండలాధ్యక్షుడు సహదేవయ్య, ఎస్‌ఎస్సి ఉద్యోగులు పాల్గొన్నారు. ఎస్‌ఆర్‌ పురం: మండలంలోని విద్యాశాఖ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్న సమగ్ర శిక్ష సిబ్బంది సమ్మెకు సంఘీభావంగా మద్దతు తెలియజేస్తూ ఎస్‌ఆర్‌ పురం యుటిఎఫ్‌, ఎస్‌టియు, ఏపీటీఎఫ్‌ యూనియన్లు, ఉపాధ్యాయ బందం బుధవారం ఆర్థికసాయం అందించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర శిక్ష సిబ్బంది న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి, వెంటనే రేగులైజేషన్‌ చేయాలని, పెండ్డింగ్‌లో ఉన్న వేతనాలును వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. సమ్మెకు మద్దతుగా రూ.20వేలే ఆర్థిక సాయం చేశారు.

➡️