చాట్‌బాట్‌ యాప్‌తో పోగోట్టుకున్న ఫోన్సు రికవరీ

చాట్‌బాట్‌ యాప్‌తో పోగోట్టుకున్న ఫోన్సు రికవరీ

చాట్‌బాట్‌ యాప్‌తో పోగోట్టుకున్న ఫోన్సు రికవరీఇంటర్వ్యూ ప్రజాశక్తి -చిత్తూరుఅర్బన్‌: పొగొట్టుకున్న, చోరీకి గురైన విలువైన సెల్‌ఫోన్సును చాట్‌బాట్‌ యాప్‌ద్వారా తిరిగీ పొందవచ్చని జిల్లా ఎస్పీ రిషాంత్‌రెడ్డి తెలిపారు. చిత్తూరు క్రైమ్‌ పోలీసులు చాట్‌బాట్‌ యాప్‌ను సమర్థవంతంగా సెల్‌ఫోన్సు రికవరీ చేస్తున్నట్లు చెప్పారు. చాట్‌బాట్‌ సేవలపై ‘ప్రజాశక్తి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వూ..ప్రజాశక్తి : ఇప్పటి వరకు చాట్‌బాట్‌ యాప్‌ద్వారా ఎన్ని సెల్‌ఫోన్సు రికవరీ చేశారు..?ఎస్పీ: నాలుగు దశలలో సుమారు 2 కోట్ల 50 లక్షల విలువ గల 1200 ఫోన్ల రికవరీ చేశాం.. ఒక నెల సమయంలోనే 200 ఫోన్లను రికవరీ చేశాం..ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుండి రికవరి చేసి బాధితులకు అందించాం..జమ్మూ అండ్‌ కాశ్మీర్‌, రాజాస్థాన్‌, ఢిల్లీ, కేరళ, బీహార్‌ వంటి రాష్ట్రాల నుండి మొబైల్‌ ఫోన్ల రికవరీ చేశాం.ప్రజాశక్తి: సెల్‌ఫోన్సు రికవరీ తరువాత ఇతర రాష్ట్రాల వారికి ఎలా అందజేస్తున్నారు…? ఎస్పీ: ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుండి కూడా ఫిర్యాదు చేస్తున్న బాధితులకు ఇతర రాష్ట్రాల నుండి చిత్తూరుకు రాని వారికి ప్రత్యేకంగా కొరియర్‌ ద్వారా బాధితుల ఫోన్‌ లను నేరుగా వారి ఇంటికి చేర్చుతున్నాం.ప్రజాశక్తి: మొబైల్‌ ఫోన్‌ పొగొట్టుకుంటే ఇంటి నుండే ఎలా ఫిర్యాదు చేయాలి…? ఎస్పీ: మొబైల్‌ఫోను పొగొట్టుకుంటే ఇంటినుండే చాట్‌బాట్‌ యాప్‌ ద్వారా పిర్యాదు చేసే అవకాశముంది. ఈ యాప్‌ద్వారా పొగొట్టుకున్న మొబైల్‌ ఫోన్‌ ను మరల పొందవచ్చు. మొబైల్‌ పోగొట్టుకున్న బాధితులు చిత్తూరు జిల్లా నుండే కాకుండా ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుండి కూడా ఫిర్యాదు వస్తున్నాయి. ఇంకా పెండింగ్‌ రికవరీ లు ఉన్నాయి. వాటిని కూడా త్వరలో రికవరీ చేసి భాదితులకు అందిస్తాం.ప్రజాశక్తి: మొబైల్‌ఫోను పొగొట్టుకుంటే చాట్‌బాట్‌ యాప్‌లో ఎలా ఫిర్యాదు చేయాలి….? ఎస్పీ: మైబ్‌లో ఫోన్‌ పొగొట్టుకున్న వారు ముందు 9440900004 నంబర్‌ వాట్సాప్‌కు హెరు.. లేదా హెల్ఫ్‌ అని పంపాలి. తరువాత వెంటనే వెల్‌కమ్‌ టూ చిత్తూరు పోలీస్‌ పేరున లింకు హెరు లేదా హెల్ప్‌ అని వస్తుంది. ఈ లింకుపై గూగుల్‌ఫార్మెట్‌ ఓపెన్‌ అవుతుంది. ఆ వివరాలను పూరించాలి. జిల్లా పేరు వయసు, తండ్రిపేరు, చిరునామా, కాంట్రాక్టింగ్‌ నంబర్‌, మిస్‌ అయిన ప్లేస్‌ వివరాలను సబ్‌మిట్‌ చేసిన వెంటనే కంప్లైట్‌ లాడ్జి అవుతుంది. చాట్‌బాట్‌ సేవలను ప్రజలు వినియోగించుకోవాలి.. ఫోన్‌ చోరీకి గురయినా..మిస్‌ అయినా చాట్‌బాట్‌ యాప్‌ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు.

➡️