చరిత్రలో నిలిచి పోనున్న చంద్రబాబు సభ – మాజీ మంత్రి అమరనాథరెడ్డి

చరిత్రలో నిలిచి పోనున్న చంద్రబాబు సభ - మాజీ మంత్రి అమరనాథరెడ్డి

చరిత్రలో నిలిచి పోనున్న చంద్రబాబు సభ – మాజీ మంత్రి అమరనాథరెడ్డిప్రజాశక్తి -గంగాధర నెల్లూరు: గంగాధర నెల్లూరు మండలం రామానాయుడు పల్లె వద్ద ఈనెల 6వ తేదీ జరగనున్న టిడిపి రా కదలిరా సభా కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాల్గొంటారని ఈ సభ రాష్ట్ర స్థాయిలో చిరస్థాయిగా నిలుస్తుందని మాజీ మంత్రి అమరనాథరెడ్డి అన్నారు. రాష్ట్రంలో వైసిపి వ్యతిరేక విధానాల వల్ల యువకులు విద్యార్థులు రైతులు మహిళలు వ్యాపారస్తులతో పాటు బడుగు, బలహీన వర్గాలు లక్ష మందికి పైగా హాజరవుతారన్నారు. ఈ సమావేశంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు పులివర్తి నాని, గంగాధర నెల్లూరు నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి డాక్టర్‌ థామస్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండ యాదవ్‌, రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్‌ శ్రీధర్‌ వర్మ , తో పాటు మండల పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు.

➡️