బర్డ్‌ ప్లూ కలకలం

Feb 19,2024 21:56
బర్డ్‌ ప్లూ కలకలం

రాష్ట్రంలో బర్డ్‌ప్లూ సోకిందనే ఉదంతాలతో పశుసంవర్థకశాఖ అధికారులు అప్రమత్తం అవుతున్నారు. విజయవాడలో పెద్దసంఖ్యలో కోళ్లు చనిపోతున్నాయి. కృష్ణ, గోదావరి, నెల్లూరు అనంతపురం జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేస్తున్నారు అధికారులు. కోళ్లు మృతికి బర్డ్‌ఫ్లూ కారణమని నిర్ధారణతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. నెల్లూరు జిల్లాలో ఇటీవల బర్డ్‌ఫ్లూ వ్యాధి కోళ్ళలో నిర్ధారణ అయినందు వలన జిల్లా పశు సంవర్థకశాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు. జిల్లా పశుసంవర్థకశాఖ గణంకాల ప్రకారం జిల్లాలో పౌల్ట్రీ పరిశ్రమల్లో 9.35 లక్షల కోళ్లు ఉన్నాయి. అలాగే 6.5లక్షల పెరటి కోళ్లు ఉన్నాయి. సంవత్సరానికి 37,089 మెట్రిక్‌ టన్నుల కోడి మాంసం, 10,723లక్షల కోడి గుడ్లు ఉత్పత్తి అవుతోంది. జిల్లా బర్డ్‌ఫ్లూ సోకకుండా అప్రమత్తమైన పశుసంవర్థక శాఖ తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది. అంతేకాకుండా జిల్లాలో పశుసంవర్థశాఖ వైద్యులు, సిబ్బందని అప్రమత్తం చేయడంతో పాటు జిల్లాలోని కోళ్ల పరిశ్రమ యజమానులు అప్రమత్తం చేశారు. బర్డ్‌ప్లూ వ్యాధి సోకేది ఇలా…. బర్డ్‌ప్లూ వ్యాధి ముఖ్యంగా విదేశీ వలస పక్షుల ద్వారా ఒక ప్రాంతం నుండీ మరో ప్రాంతానికి వ్యాపిస్తుంది. ఈ వ్యాధి కోళ్లకే కాకుండా ఇతర పక్షులైన గినికోళ్లు, టర్కి కోళ్లు, బాతులు, కొంగలు, నీటి పక్షులకు కూడా వ్యాపిస్తుంది. వ్యాధిసోకిన కోళ్లులో దగ్గు, జలుపు, ఆయాసం, తుమ్ములు వంటి లక్షణాలు ఉంటాయి. దాణా సరిగా తినక రెట్టలు పలుచగా వేస్తాయి. గుడ్ల ఉత్పత్తి గణీయంగా పడిపోవడం, మరణాలశాతం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కోడి గుడ్డను, కోడి మాంసం బాగా ఉడికించి తినడం వల్ల వ్యాధి మనుషులకు సోకకుండా కాపాడుకోవచ్చు. కోళ్ళు, దాణా దిగుమతి నిషేధం.. కోళ్ళలో బర్డ్‌ప్లూ వ్యాధికి చికిత్స లేదు. టీకాలు లేవు, నివారణనే మార్గం. అందులో భాగంగా నెల్లూరు జిల్లా నుండీ ఎటువంటి కోళ్ళు, కోళ్ళకు సంబంధించిన ఉత్పత్తులు, వాటి దాణా దిగుమతి చేసుకోవడాన్ని జిల్లాలో అధికారులు నిషేధించారు. కోళ్ళ యజమానులు జీవరక్షణ (బయో సెక్యూరిటి) విధానాల గురించి అవగాహన కల్పించడం, అకస్మాత్తుగా ఎక్కువ సంఖ్యలో కోళ్ళులో మరణాలు సంభవిరచిన ఎడల సమీప పశువైద్యులకు సమాచారం అందించాలని సూచిొచారు.బర్డ్‌ప్లూ పై అప్రమత్తంగా ఉన్నాం- డాక్టర్‌ ప్రభాకర్‌, పశుసంవర్థశాఖ జిల్లా అధికారి బర్డ్‌ప్లూపై అప్రమత్తంగా ఉన్నాం. జిల్లా వ్యాప్తంగా పశుసంవర్థశాఖ వైద్య సిబ్బందని అలర్ట్‌ చేయడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న కోళ్ళ పరిశ్రమ నిర్వహకులను బర్డ్‌ప్లూ లక్షణాలు కనిపిస్తే పదికి మించి కోళ్ళు చనిపోతే వెంటనే సమీపంలోని పశువైద్యులను సమాచారం ఇవ్వాలని సూచించాం. చిత్తూరు జిల్లాలో ప్రస్తుతానికి బర్డ్‌ప్లూ లక్షణాలు కనిపించడం లేదు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొందుకు పశుసంవర్థకశాఖ సిద్ధంగా ఉన్నాం. 31 మండలాల్లో రాఫిడ్‌ రెస్సాన్స్‌ టీమ్స్‌ ఏర్పాటు చేశాం. పిపిఇ కిట్లు, క్రిమిసంహార మందులు జిల్లాలోని అన్ని పశువైద్య కేంద్రాల్లో అందుబాటులో ఉంచాము.

➡️