మహిళలు అన్ని రంగాల్లో రాణించాలిగ్రామీణాభివృద్ధి సంస్థ సహకారం

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలిగ్రామీణాభివృద్ధి సంస్థ సహకారం

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలిగ్రామీణాభివృద్ధి సంస్థ సహకారం ప్రజాశక్తి -చిత్తూరు అర్బన్‌: గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు అన్ని రంగాల్లో రాణించాలనే లక్ష్యంతో గ్రామీణాభివృద్ధి సంస్థ మహిళలకు అండగా నిలుస్తోంది. ఇందు కోసం బ్యాంకులు, ఇతర శాఖల సహకారంతో మహిళా అభివృద్ధి కోసం కృషి చేస్తోంది. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా మహిళలు అర్థిక, సామాజిక అభివృద్ధి సాధించాలి. మహిళలను చైతన్య పరచడంతో పాటు వారిలోని శక్తి సామర్థ్యాలను వెలికి తీసేలా వృత్తి విద్యాకోర్సులో శిక్షణ ఇస్తున్నారు. ఈ మేరకు శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు బ్యాంకుల ద్వారా రుణాలు అందిస్తోంది. స్వయం శక్తితో ఆర్థికంగా నిలుదొక్కుకునేందుకు గ్రామీణాభివృద్ధి సంస్థ సహకారం అందిస్తోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో స్వయం శక్తి సంఘాలు అన్ని రంగాల్లో ముందజలో ఉన్నాయి. నవోదయం మాసపత్రికను నడుపుతూ రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలుస్తూ అవార్డులు సాధించారు. బ్యాంకు రుణాలు మంజురు, చెల్లింపులు, వృత్తి విద్య శిక్షణ, జిల్లా సమాఖ్య ఆడిటింగ్‌ ఇలా అన్ని అంశాల్లో చిత్తూరు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పురోగతి సాధిస్తోంది. గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్‌ తులసి వివరించారు. ప్రజాశక్తి అడిగిన పలు ప్రశ్నలకు వారు సమాధానం ఇచ్చారు.. వారి మాటల్లోనే..ప్రశ్న: ‘వైఎస్‌ఆర్‌ ఆసరా’ ద్వారా ఎంత మంది ప్రయోజనం పొందారు? సమాధానం: వైఎస్‌ఆర్‌ ఆసరాను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. జిల్లాలోని స్వయం సహాయక సంఘాల మహిళలకు ఆసరా పథకం ద్వారా వారి ఖాతాల్లో నాలుగు విడుతలు జమ చేస్తున్నారు. ఈ పథకం కింద జిల్లాలో 2019 ఏప్రిల్‌ 17వ తేది వరకు ఉన్న బ్యాంకు రుణాలు మాఫీ చేస్తున్నారు. ఈ లెక్కన నాలుగు విడతల్లో 60.440 స్వయం సహాయ సంఘాల మహిళల బ్యాంకు ఖాతాల్లో రూ.238.82 కోట్లు జమ చేశారు. మొదటి విడతలో రూ.579.74 కోట్లు, రెండు, మూడో విడతల్లో రూ. 580.18 కోట్లు, నాలుగో విడతలో జిల్లాలో రూ.33,655 ఎస్‌హెచ్‌జి లకు చెందిన 3,10,643 మంది రూ.324 కోట్లు వారి వ్యక్తిగత ఖాతాల్లో జమ చేస్తారు.ప్రశ్న: మహిళా మార్టులు ఏవిధంగా నడుస్తున్నాయి? సమాధానం: జిల్లాలో స్వయం శక్తి సంఘాల ద్వారా పట్టణ ప్రాంతాల్లో నిర్వహిస్తున్న మహిళా మార్టులు సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోకి విస్తరించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించి ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నాం. తవణంపల్లి, పెనుమూరు మండలాల్లో చేయూత మహిళా మార్టులు ఏర్పాటు చేస్తున్నాం. స్వయం సహాయ సంఘాలు తయారు చేసే ఉత్పత్తులు మార్టులో పెట్టి విక్రయిస్తున్నారు.ప్రశ్న: చిరుధాన్యాల ఉత్పత్తి పెంచేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ? సమాధానం: కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు చిరుధాన్యాల సాగును పెంచేందుకు కృషి చేస్తున్నారు. జిల్లాలోని అన్ని మండలాలు, గ్రామాల్లో చిరుధాన్యాల సాగు విస్తీర్ణం పెంపునకు స్వయం సహాయ సంఘాల మహిళలు కృషి చేస్తున్నారు. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా అవగాహన కల్పించాం.. రైతు సాధికార సంస్థ సహకారంతో జిల్లాలో 15 వేల టన్నుల రాగులు పండిచాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం. ప్రశ్న: బల్క్‌మిల్‌ సెంటర్లు ( బిఎంసీ)ల పరిస్థితి ఎలా ఉంది? సమాధానం: జిల్లాలో పాల ఉత్పత్తి ముఖ్య జీవనాధారం.. డిఆర్‌డిఎ ఆధ్వర్యంలో మండల సమాఖ్యల పర్యవేక్షణలో 73 బిఎంసియులు ద్వారా 3.02 లక్షల లీటర్లు పాలు ప్రతి రోజూ సేకరించి ఉత్పత్తిదారులకు గిట్టుబాటు ధర కల్పిస్తున్నారు. చిత్తూరు జిల్లాలో 36 బిఎంసీల ద్వారా రోజుకు 16,2,045 లీటర్లు, అన్నమయ్య 22 బిఎంసీల ద్వారా 84, 457 లీటర్లు, తిరుపతి 15 బిఎంసీల ద్వారా 55,625 లీటర్లు పాలు సేకరిస్తున్నారు.ప్రశ్న: ఉన్నతి పథకం అమలు తీరు ఎలా ఉంది? సమాధానం: ఈ పథకం పూర్తిగా ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి కోసం ప్రభుత్వం అమలు చేస్తోంది. ఎస్సీ, ఎస్టీ కుటుంబాల్లోని మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేలా ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధుల నుండి 9,314 మందికి రూ.45,16 కోట్లు ఇవ్వడంతో పాటు యానాదుల సబ్‌ప్లాన్‌ నుండి 1,609 మందికి రూ. 7.76 కోట్లు అందించాం.

➡️