రైతు ఇంటిపై ఏనుగుల దాడి

Jan 2,2024 22:53
రైతు ఇంటిపై ఏనుగుల దాడి

– పశువులపై దాడి, అరటి తోట ధ్వంసంప్రజాశక్తి- గంగవరం మండలంలోని కొత్తపల్లి పంచాయతీ కేసుపెంట గ్రామంలో మంగళవారం ఉదయం 5గంటలకు ఏనుగులు గుంపు ఊరి పొలిమేర్లులోని రైతు రఘునాథ్‌ ఇంటిని పూర్తిగా ధ్వంసం చేశాయి. దీంతో భయబ్రాంతులకు గురైన ఇంటిలోని కుటుంబ సభ్యులు పరుగులు తీశారు. అనంతరం పక్కనే ఉన్న గడ్డివామి వద్ద ఉన్న పశువులను సమ్మితం తొక్కి గాయపరిచాయి. ఈ సందర్భంగా బాధిత రైతు మాట్లాడుతూ తెల్లవారు జామున పెద్ద శబ్ధం రావడంతో కిటికీలోనుంచి చూడగా ఏనుగులు కనిపించాయని వెంటనే ఓ మూలన శబ్దం చేయకుండా వాటికి కనిపించకుండా కూర్చోవడంతో అవి ఇంటిని ధ్వంసం చేసి గడ్డివాము వైపు వెళ్లగానే గ్రామంలోకి పరుగుతీశామని తెలిపారు. ఇప్పటి వరకు ఏనుగులు పంటపొలాలపైనే దాడులు చేసి అడవిలోకి వెళ్లేవని ఇప్పుడు గ్రామంలోకి వచ్చిన తన ఇంటిపై దాడి చేయడమే కాకుండా పశువులను గాయపరిచాయని వాపోయాడు. అంతేకాకుండా పక్కనే ఉన్న అరటి పంటను తిని తొక్కి నాశనం చేశాయని, అటవీ శాఖ, ప్రభుత్వ అధికారులు స్పందించి తమకు నష్టపరిహారం ఇప్పించాలని కోరుతున్నాడు.

➡️