సోమలలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు

Mar 18,2024 11:09 #Chittoor District

ప్రజాశక్తి-సోమల : సోమల మండలంలో పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు మూడు పరీక్ష కేంద్రాలలో ప్రశాంత వాతావరణంలో ప్రారంభం అయ్యాయి. మండల కేంద్రమైన సోమల మేజర్ పంచాయతీ కేంద్రమైన కందూరు, పెద్ద ఉప్పరపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయడంతో విద్యార్థులు సమయపాలన పాటించి పరీక్ష హాలు వద్దకు చేరుకున్నారు. ఎస్సై వెంకట నరసింహులు మహిళా పోలీసులు మూడు పరీక్ష కేంద్రాల వద్ద ఏర్పాట్లను ఇతర భద్రతా చర్యలను పరిశీలించి విద్యార్థులకు ధైర్యం కలిగే విధంగా చర్యలు తీసుకున్నారు.

➡️