దోమల నివారణ చర్యలపై అవగాహన

దోమల నివారణ చర్యలపై అవగాహనప్రజాశక్తి- బైరెడ్డిపల్లి : జాతీయ డెంగీ దినోత్సవం సందర్భంగా సమాజ భాగస్వామ్యంతో డెంగీ వ్యాధిని నివారిద్దాం.. అంటూ డాక్టర్‌ విజయచంద్ర, హెల్త్‌ ఎడ్యుకేటర్‌ సావిత్రి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పిహెచ్‌సి సిబ్బందితో కలిసి గ్రామంలో దోమల నివారణ చర్యలపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. డాక్టర్‌ విజయచంద్ర మాట్లాడుతూ గ్రామాల్లో ప్రతి శుక్రవారం డ్రైడే నిర్వహించాలని, ఇంటి పరిసరాలను పరిశుభ్రం ఉంచుకోవాలని, నీటి నిల్వలను తొలగించాలని సూచించారు. అలాగే దోమలు కుట్టుకుండా దోమతెరలు వాడాలని తెలిపారు. అలాగే ‘అడల్ట్‌ బీసీజీ వ్యాక్సినేషన్‌’ కార్యక్రమాన్ని ప్రారంభమైనదని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఎస్‌ఆర్‌ పురం: గురువారం డెంగీ వ్యాధి నివారణ దినోత్సవ సందర్భంగా పిహెచ్‌సి వైద్యాధికారి డాక్టర్‌ గిరి, సందీప్‌ రాజ్‌ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ప్లే కార్డులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. డెంగీ వ్యాధి నివారణకు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. ఆరోగ్య కార్యకర్తలు, ఆశలు, వైద్యశాల సిబ్బంది పాల్గొన్నారు.

➡️