దేశాన్ని బలహీనపరిచే సిఏఏ చట్టాన్ని అడ్డుకుందాం

Mar 15,2024 16:43 #Chittoor District

సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు పిలుపు

ప్రజాశక్తి-చిత్తూరు : నరేంద్ర మోడీ నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం అమలు కోసం నిబంధనలు ప్రకటించడాన్ని సిపిఎం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. శుక్రవారం చిత్తూరులోని మసీదుల వద్ద ముస్లిం సోదరులకు సిఏఏ చట్టంను వ్యతిరేకించాలని విస్తృతంగా ప్రచారం చేయడం జరిగింది. సిపిఎం జిల్లా నాయకులు సురేంద్రన్ తో కలిసి ఆయన మాట్లాడుతూ రాజ్యాంగ విరుద్ధమైన దేశ సమైక్యతకు ప్రమాదకరమైన ముస్లిం మైనార్టీలను లక్ష్యం చేసుకొని ప్రకటించిన ఈ సీఏఏ నిబంధనలను వెంటనే ఉపసరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. 2019లో ఆమోదించబడిన సిఏఏ చట్టాన్ని ప్రజా ఆందోళన వల్ల ఐదేళ్లు మూలన పెట్టి ఇప్పుడు కొద్ది రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని దాన్ని అమలుపరిచేందుకు నిబంధన నోటిఫికేషన్ ప్రకటించడం స్పష్టంగా ఎన్నికల్లో ప్రయోజనం పొందేందుకు బిజెపి ఆడుతున్న ప్రమాదకరమైన నాటకంలో భాగమైననే అన్నారు. ఈ చట్టం వలన దేశంలో ఉద్రిక్తలు ఏర్పడతాయి. మన లాంటి రాష్ట్రంలో అశాంతి నెలకొంటుంది. ఇలాంటి చట్టాన్ని ప్రజలందరూ కూడా వ్యతిరేకించాలని ఆయన పిలుపునిచ్చారు. పౌరసత్వ సవరణ చట్టం రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధమైనది. రాజ్యాంగంలోని ఐదవ అధికరణం నుండి 11వ అధికరణం వరకు పారుసత్వం గురించిన విధివిధానాలు నిర్దేశించారు. వాటి ఆధారంగా ఉనీకి లోకి వచ్చిందే పౌరసత్వ చట్టం 1955 .ఈ చట్ట ప్రకారం ఈ దేశంలో పుట్టిన ప్రతి వ్యక్తి ఆ వ్యక్తి వారసులుగా ఉన్న ప్రతి వ్యక్తి భారతీయుడైనను తేల్చి చెప్పింది. ఈ దేశంలో నివసించడానికి సిద్ధపడిన వారిని కూడా సహజసిద్ధంగా పౌరసత్వం సంక్రమిస్తుందని ఈ చట్టం స్పష్టం చేసింది .కానీ ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం ఆమోదించిన పౌరసత్వ చట్టం కుల, ప్రాంత ,లింగ ,జాతి సాంస్కృతికపరమైన విభజనకు అతీతంగా భారతీయులందరికీ సమాన పౌరుషత్వ హక్కు కల్పించాలన్న రాజ్యాంగ స్ఫూర్తిని తుంగలో తొక్కుతుంది .అందువల్ల పౌరసత్వ సవరణ చట్టం ఈ దేశంలోని ముస్లిముల సమస్య కాదు. అది దేశ రాజ్యాంగానికి లౌకిక ప్రజాస్వామ్యానికి ముంచుకొస్తున్న ప్రమాదానికి సంబంధించిన సమస్య. లౌకిక ప్రజాస్వామ్య రాజ్యాంగం స్థానంలో హిందూ రాష్ట్ర ఏర్పాటుకు ఆర్ఎస్ఎస్ బిజెపిలో చేస్తున్న ప్రయత్నాల్లో నాడు బాబ్రీ మసీదు కూల్చివేత ,నేడు జమ్మూ కాశ్మీర్ ను చేర్చడం 370 అధికరణ రద్దు ప్రస్తుత సవరణ చట్టం తేవడం ఇందులో భాగమే. ఈ దశలోనే త్రిప్పి కొట్టకపోతే అమీషా చెప్పినట్లు రేపు దేశమంతటా ఎన్ఆర్సి అమలు నిరాగాటకంగా పూనుకుంటారు. అప్పుడు భారతీయులైన మనం భారతీయులమేనని నిరూపించుకోవడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్యూలైన్లో నిల్చుకొని పత్రాలు సమర్పించాల్సి వస్తుంది. పత్రాల లేకపోతే మనమంతా స్వదేశంలో అక్రమ వలసదారులమవుతాం. కాబట్టి మతాలకతీతంగా ప్రజలంతా ఏకమవాలని పౌరసత్వం చట్టాన్ని త్రిప్పి కొట్టాలని సిపిఎం పిలుపునిస్తున్నది .ఈసందర్భంగా ప్రజాశక్తి ముద్రించిన సిఏఏ స్పెషల్స్ ను చిత్తూరు నగరంలో ముస్లిం సోదరులలో విశేష స్పందన లభించింది. అందరూ ఐక్యంగా ఎదుర్కొందామని ముస్లిం సోదరులు పిలుపునిచ్చారు.

➡️