పులివర్తి నానిని పరామర్శించిన ఃదగ్గుమళ్ళః

పులివర్తి నానిని పరామర్శించిన ఃదగ్గుమళ్ళః

పులివర్తి నానిని పరామర్శించిన ఃదగ్గుమళ్ళఃప్రజాశక్తి-చిత్తూరు అర్బన్‌: వైసీపీ మూకల దాడిలో గాయపడిన టీడీపీ చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిని ఎంపీ అభ్యర్థి దగ్గుమళ్ళ ప్రసాదరావు బుధవారం తిరుపతి స్విమ్స్‌ ఆసుపత్రికి చేరుకొని పరామర్శించారు. ఆయనతో పాటు మాజీ మంత్రి అమరనాథ్‌రెడ్డి, పూతలపట్టు ఎమ్మెల్యే అభ్యర్థి కలికిరి మురళిమోహన్‌, చిత్తూరు జిల్లా పార్టీ అధ్యక్షులు సీఆర్‌ రాజన్‌, టిడిపి సీనియర్‌ నేత చంద్ర ప్రకాష్‌, మాజీ మేయర్‌ హేమలత ఉన్నారు. తిరుపతి శ్రీ పద్మావతి మహిళా వర్సిటీలో స్ట్రాంగ్‌ రూమ్‌ పరిశీలనకు మంగళవారం వెళ్ళిన పులివర్తి నానిపై విచక్షణారహితంగా దాడి చేయడంతో ఆయన గాయపడి అపస్మారక స్థితికి చేరుకోవడంతో నానిని స్విమ్స్‌కు తరలించారు. ఈ నేపథ్యంలో అక్కడ చికిత్స పొందుతున్న ఆయనను ప్రముఖులు పరామర్శించారు. అనంతరం మీడియా సమావేశంలో దాడిని వారు ముక్తకంఠంతో ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు హేయమైన చర్యగా పేర్కొన్నారు. పోలీసుల వైఫల్యం వల్లే ఈ దాడి జరిగిందని దాడికి కారణమైన వారిని వెంటనే అరెస్టు చేయాలని వారు డిమాండ్‌ చేశారు.

➡️