కాంగ్రెస్‌ అభ్యర్థి ప్రచారం

ప్రజాశక్తి-కొమరోలు: ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలోని రాజుపాలెం పంచాయతీ ఇలాకాలోని ద్వారకచర్ల, రాజుపాలెం, రౌతుపల్లె, వెంకటాపురం, తదితర గ్రామాలలో కాంగ్రెస్‌ గిద్దలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పగడాల పెద్ద రంగస్వామి శనివారం సుడిగాలి పర్యటన నిర్వహించారు. ఇందులో భాగంగా ఇంటింటికీ తిరిగి ఓటర్లను అభ్యర్థించారు. ఈ అభ్యర్థనలో భాగంగా కాంగ్రెస్‌ మేనిఫెస్టోను వివరిస్తూ కరపత్రాలు అందజేశారు. ప్రజలకు రైతు రుణమాఫీ రూ.2 లక్షలు, ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు, ఇల్లు లేని వారికి రూ.ఐదు లక్షలతో ఇల్లు, కేజీ 2 పీజీ ఉచిత విద్య, వృద్ధులకు వితంతువులకు 4,000 పెన్షన్‌, వికలాంగులకు 6,000 పెన్షన్‌, ఉపాధి హామీ కూలీకి రోజుకు కనీసం రూ.400 వేతనం, మొదటి సంవత్సరం కేంద్రం ద్వారా రూ.30 లక్షలు రాష్ట్రం ద్వారా రెండు 2.25 లక్షల ఉద్యోగాలు, రైతు పెట్టుబడి మీద 50 శాతం లాభంతో మద్దతు ధర, ప్రతి పేద కుటుంబంలో ఒక మహిళకు ప్రతి నెల 8,333 రూపాయలు, మహాలక్ష్మి పథకం కింద రూ.లక్ష అందిస్తారని ప్రజలకు వివరించారు. కరపత్రాలను పంపిణీ చేశారు. మే 13వ తేదీ జరగబోయే ఎన్నికలలో గిద్దలూరు అసెంబ్లీ అభ్యర్థిగా పగడాల పెద్ద రంగస్వామికి, ఎంపీ అభ్యర్థి ఈదా సుధాకర్‌రెడ్డికి మీ పవిత్రమైన ఓటు వేసి వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

➡️