దిక్కుతోచని స్థితిలో రైతులు

Dec 7,2023 11:52 #Krishna district
crop damage in krishna district

ప్రజాశక్తి-మోపిదేవి : అవనిగడ్డ నియోజవర్గం మోపిదేవి మండలం కప్తాను పాలెం గ్రామంలో మొలకెత్తిన వరి పొలాన్ని రైతు దమ్ము చేయించారు. కౌలుకు తీసుకుని ఆరు ఎకరాల్లో వరి సాగు చేయడం జరిగిందని, అకాల వర్షానికి పంట నీట మునిగి మొలకలు రావడంతో ఆర్థికంగా నష్టపోయానని రైతు వాపోతున్నారు. లక్ష రూపాయలకు పైగా పెట్టుబడి పెట్టి, ఇప్పుడు మొలకెత్తిన వరి పంటను కోసేందుకు కుప్ప వేసేందుకు నూర్పుడి చేయించేందుకు వేలాది రూపాయలు ఖర్చు కావడంతో, భరించలేక రైతు దమ్ము చేయిస్తున్నారు. ప్రభుత్వం కూడా తమను ఆదుకునేందుకు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత పది రోజుల క్రితం మూడు ఎకరాల్లో నూర్చిన ధాన్యాన్ని ఇప్పటివరకు కొనుగోలు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు కూడా నీట మునిగిన తమ పంట పొలాలను పరిశీలించేందుకు రాలేదని ఆరోపించారు. చేతికి అంది వచ్చిన పంట నష్టపోవడంతో దాదాపు రూ. 1.30 లక్షలు వరకు నష్టపోయామని రైతు చెబుతున్నారు.నీట మునిగిన వరి ఫైరును దమ్ము చేయించి మినుము పంట వేసుకోడం మినహా గత్యంతరం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

➡️