చీరాలలో కార్డన్ సర్చ్..

Nov 25,2023 15:18 #Bapatla District
curton search in chirala

150 లీటర్ల బెల్లపు ఊట ద్వాంసం,4 లీటర్ల నాటుసారా స్వాధీనం
8 ద్విచక్ర వాహనాలను, 4 ఆటోలు సీజ్
జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్ ఆదేశాలతో సర్చ్

ప్రజాశక్తి – చీరాల : జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఐపీఎస్ ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ పి మహేష్ సూచనలతో చీరాల డి.ఎస్.పి ప్రసాద్ రావు పర్యవేక్షణలో శనివారం చీరాల టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామ్ నగర్ లో ట్రైనీ డి.ఎస్.పి టి.విద్యాశ్రీ, చీరాల టూ టౌన్ ఇన్స్పెక్టర్ జి.సోమశేఖర్, చీరాల 1టౌన్ ఇన్స్పెక్టర్ పి. శేషగిరిరావు, చీరాల సెబ్ ఇన్స్పెక్టర్ సోమయ్య సిబ్బంది చీరాల రాంనగర్ పరిసర ప్రాంతాలలో కార్డన్ సర్చ్ నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా చీరాల టూ టౌన్ ఇన్స్పెక్టర్ సోమశేఖర్ మాట్లాడుతూ గంజాయి, నాటుసారా కట్టడికి పటిష్ట చర్యలు తీసుకుంటున్నామన్నారు. అందులో భాగంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఐపీఎస్ ఆదేశాల మేరకు రామ్ నగర్ లో కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించడం జరిగిందన్నారు.గంజాయి, నాటుసారా ఇతర అసాంఘిక కార్యకలాపాలను కట్టడి చెయ్యడమే లక్ష్యంగా కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించామన్నారు. గతంలో రామ్ నగర్ పరిసర ప్రాంతాలలో నివాసముండే కొంతమంది నాటుసారా, గంజాయి క్రయ, విక్రయాలకు సంబంధించిన కేసులలో పట్టుబడినందున ఈ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి సారించి కార్డన్ సెర్చ్ నిర్వహించడం జరిగిందన్నారు.గంజాయి, నాటుసారా ఇతర ఆసాంఘిక కార్యకలాపాల గురించిన సమాచారం తెలిసిన యెడల వెంటనే పోలీస్ స్టేషన్ కు గానీ లేక 100, 112 లకు గాని కాల్ చేసి సమాచారం అందించాలన్నారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని ఇన్స్పెక్టర్ ప్రజలకు తెలియజేసినారు.ఈ సర్చ్ లో భాగంగా గంజాయి, నాటుసారా ఇతర అసాంఘిక కార్యకలాపాలను కట్టడి చెయ్యడమే లక్ష్యంగా రామ్ నగర్ లో పోలీస్ అధికారులు, సిబ్బంది మరియు చీరాల సెబ్ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన కార్డన్ సెర్చ్ లో సరైన పత్రాలు లేని అనుమానిత 8 ద్విచక్ర వాహనాలు, 4 ఆటోలను పోలీస్ అధికారులు సీజ్ చేసినారు. నాటు సారా తయారీకి పులియబెట్టిన 150 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేసి, 4 లీటర్ల నాటు సారాను పోలీస్ అదికారులు స్వాధీనం చేసుకున్నారు.వీరి వెంట ,ముగ్గురు ఎస్.ఐ లు, 70 మంది సబ్ డివిజన్ పరిధిలోని పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

➡️