ఎన్నికల సామగ్రి పంపిణీ

ప్రజాశక్తి-చిలకలూరిపేట

గణపవరం శ్రీ చుండి రంగనాయకు లు ఇంజనీరింగ్‌ కళాశాలలో ఎన్నికల విధుల్లో పాల్గొననున్న సిబ్బందికి ఎన్నికల సామగ్రిని ఆదివారం సాయంత్రానికి పం పిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని చిలక లూరిపేట ఎన్నికల అధికారి నారదముని, ఎఇఆర్వోలు జ్వాలా నరసింహం, అష్రి పున్ని సాబేగం, గోవిందంరావు, జన రల్‌ అబ్జర్వర్‌ షామణిపాండే, నరసరావు పేట డిఎస్పీ వర్మ పర్యవేక్షించారు. చిలకలూరి పేట నియోజకవర్గ పరిధిలో 239 పోలింగ్‌ కేంద్రాలతో పాటూ మరో రెండు యాగ్జిలరీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పట్టణ పరిధిలో 136వ కేంద్రం, 163వ కేంద్రంలో 1500లకు పైగా ఓటర్లు దాటిన మీదట, ఈ రెండు కేంద్రాలను అదనంగా ఏర్పాటు చేశారు. ఒక్కో కేం ద్రానికి ఐదుగురు చొప్పున సిబ్బందిని కేటాయించారు. ఆర్టీసీ బస్సు ద్వారా పోలీ సుల భద్రత నడుమ సామాగ్రి కేంద్రాలకు తర లించారు. ఈ సందర్భంగా ఆర్వో నారదముని మాట్లాడుతూ, చిలకలూరి పేట నియోజకవర్గ పరిధిలో 32 కేంద్రాలను క్రిటికల్‌ పోలింగ్‌ కేంద్రాలుగా గుర్తించామని, నిఘా కెమెరాల సంఖ్య 139 నుండి 185 వరకూ పెంచినట్లు తెలిపారు. 1 నుండి 57 వరకూ నాదెండ్ల, 58 నుండి 114 వరకూ యడ్లపాడు, 115 నుండి 241 కేంద్రాలకు పట్టణ, రూరల్‌ పరిధిలో ఏర్పాటు చేశారు. సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలకు ప్రత్యేక పోలీసు బలగాలను ఏర్పాటు చేస్తున్నట్లు డిఎస్పీ తెలిపారు. మూడు మండలాలతో పాటు పట్టణ పరిధిలో జనరల్‌ పోలీ సులతో పాటూ పారా మిలటరీ బలగాలను రంగంలోకి దించారు. చిలకలూరిపేట రూరల్‌ సిఐ శ్రీనివాసరెడ్డి, అర్బన్‌ సిఐ రమేష్‌, మూడు మండలాల ఎస్సైలు పర్యవేక్షిస్తున్నారు.

చిలకలూరిపేట పట్టణంలో ఎన్ని కలకు మొత్తం 72 పోలింగ్‌ కేంద్రాలు ఉం డగా వాటిలో 12 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలు గా గుర్తించామని అర్బన్‌ సిఐ పి.రమేష్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలి పారు. సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల్లో అదనపు పోలీస్‌ బలగాలను నియమించా మని, సిసి కెమెరాలు, ఇతర జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపారు. సెక్షన్‌ 144 అమల్లో ఉందని ఎన్నికలు జరిగే స మయంలో ఓటు వేసే వారిని ఇబ్బం ది పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని అ వివరించారు. పోలింగ్‌ ఆఫీసర్లకు, ఓట ర్లకు సహకరించాలని ప్రజలను కోరారు.ప్రజాశక్తి – సత్తెనపల్లి రూరల్‌ఎన్నికల సిబ్బందికి ఎన్నికల అధి కారులు ఆదివారం ఎన్నికల సామాగ్రి పంపిణీ చేశారు. సత్తెనపల్లి పట్టణంలోని హోలీ ఫ్యామిలీ ఇంగ్లీష్‌ స్కూల్లో ఎన్నికల అధికారులు డిస్ట్రి బ్యూషన్‌ సెంటర్‌ ను ఏర్పాటు చేశారు. ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలు, వీవీ ప్యాట్‌ లు, దరఖాస్తు ఫారాలు తదితర సామాగ్రిని సిబ్బందికి అందజేశారు. ఉదయం 10 గంటలకు ఎన్నికల సిబ్బంది పంపిణీ కేంద్రానికి చేరు కున్నారు. నియోజకవర్గంలో అసెంబ్లీ, పార్లమెంటు కు ఒకే సారి ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అసెంబ్లీ, పార్ల మెంటు ఎన్నికలకు సంబంధించి విడి విడిగా ఈవీఎంలు, వీవీ ప్యాట్‌ యం త్రాలు పం పిణీ చేశారు. 274 పోలింగ్‌ కేంద్రాల్లో మొత్తం 2024 మంది ఎన్నికల సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. సెక్టార్‌ వారిగా సిబ్బంది నియమించారు. వీరందరికీ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి మురళీకృష్ణ పలు సూచనలు చేశారు. ఎన్నికల సిబ్బం దికి భోజన ఏర్పాట్లు చేశారు. ఎన్నికల సామాగ్రి పంపిణీ అనంతరం ఎన్నికల సిబ్బంది పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లారు.31 ఆర్టీసీ బస్సుల కేటాయంపుసత్తెనపల్లి అసెంబ్లీ ఎన్నికలకు 31 ఆర్టీసీ బస్సులను అధికారులు కేటా యించారు. ఎన్నికల సిబ్బందిని సామా గ్రిని పోలింగ్‌ కేంద్రాలకు తరలించేందుకు ఆర్టీసీ బస్సులను అధికారులు ఏర్పాటు చేశారు.ఎన్నికల అనంతరం తిరిగి ఈవీ ఎంలు స్ట్రాంగ్‌ రూమ్‌కు చేరే వరకూ ఆర్టీసీ బస్సులు ఎన్నికల ఆధికారుల అధీ నంలో ఉంటాయి.

 వినుకొండ: ఎన్నికల నిర్వహణ సిబ్బందికి స్థానిక నరసరావుపేట రోడ్డులోని నిర్మల స్కూల్‌ వద్ద ఈవీఎంలు, ఎన్నికల సామాగ్రిని రిట ర్నింగ్‌ అధికారి సుబ్బారావు పర్యవేక్షణలో అందజేశారు. వినుకొండ అసెంబ్లీ నియో జకవర్గ పరిధిలో మొత్తం 299 పోలింగ్‌ బూతులు ఉండగా, ఎన్నికల నిర్వహణ సిబ్బందికి అవసరమైన వస్తువులను ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలో 2,61,769 లక్షల మంది ఓటర్లు ఉండగా వారిలో 1,29,914 మంది పురుషులు, 1,31,856 మంది స్త్రీలు, 19 మంది ఇతరులు ఉన్నారు. నియోజవర్గంలో మొత్తం 27 సెక్టార్లు ఉండగా, ఒక్కొక్కరికి 8 నుంచి 10 బూతులు వరకు కేటా యించి సెక్టార్‌ అధికారులను నియమించి పర్యవేక్షిస్తున్నారు. ఒక్కొక్క సెక్టార్కు ఇద్దరు రూట్‌ ఆఫీసర్లు నియమించారు. ప్రతి పోలింగ్‌ బూత్‌ కి పీవో, ఓ పి ఓ, ఏపీవో, మైక్రో అబ్జర్వర్‌ లతోపాటు సహా యక సిబ్బంది ఉంటుంది. ఎన్నికలు పార దర్శకంగా ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీస్‌ బలగాలతో పాటు, కేంద్ర సాయిధ బలగాలను మోహరించారు. వెబ్‌ కెమె రాలను ఏర్పాటు చేసి అవసరమైన చోట వీడియోలు తీయించే ఏర్పాటును కూడా చేశారు. ఎన్నికల సిబ్బందికి అప్పగించిన ఈవీఎంలు, పోలింగ్‌ సామాగ్రిని తీసుకొని ఆయా పోలింగ్‌ కేంద్రాలకు కేటా యించిన ఆర్టీసీ బస్సుల్లో చేరుకున్నారు. పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేయడంతో పాటు, ముందస్తు చర్యలు చేశారు.

➡️