ట్రై సైకిల్‌ పంపిణీ

ప్రజాశక్తి-కొమరోలు: కొమరోలు మండలం తాతిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన జయరాంరెడ్డికి ఆదివారం దివ్య హెల్పింగ్‌ హ్యాండ్స్‌ ఆర్గనైజేషన్‌ వారి ఆధ్వర్యంలో ట్రై సైకిల్‌ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారుడు జయరాంరెడ్డి మాట్లాడుతూ తనలాంటి పేద వికలాంగుడికి ట్రై సైకిల్స్‌ ఇచ్చినందుకు దివ్య హెల్పింగ్‌ హ్యాండ్స్‌ ఆర్గనైజేషన్‌ వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దివ్య హెల్పింగ్‌ హాండ్స్‌ ఆర్గనైజేషన్‌ అధ్యక్షులు లొక్కు శరత్‌బాబు, ఉపాధ్యక్షులు సునీల్‌ కుమార్‌ నాయుడు, సెక్రటరీ కారుమంచి చిన్న పీరయ్య, కామూరి శివరామిరెడ్డి, రవికుమార్‌, బైక్‌ మెకానిక్‌ కిషోర్‌ కుమార్‌, వెంకటసుబ్బయ్య, గ్రామ ప్రజలు పాల్గొని సహాయం చేసిన అందించిన దాతలకు ధన్యవాదాలు తెలియజేశారు.

➡️