66 మందికి పోడు భూములకు పట్టాలు పంపిణీ

Nov 28,2023 14:27 #East Godavari

ప్రజాశక్తి -గోకవరం(తూర్పుగోదావరి) : మండలంలోని గంగంపాలెం గ్రామంలో వై ఏపీ నీడ్స్‌ జగన్‌ కార్యక్రమంలో భాగంగా 66 మంది నిరుపేద లబ్ధిదారులకు మంగళవారం జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు చేతుల మీదుగా పట్టాల పంపిణీ చేశారు. తొలిత దివంగత నేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి.. వైసిపి జెండాను ఆవిష్కరించారు. ఠాకుర్‌ పాలెం గ్రామంలో నూతనంగా నిర్మించిన హెల్త్‌ క్లినిక్‌ సెంటర్‌ భవనాన్ని ఎమ్మెల్యే చంటిబాబు ప్రారంభించారు. అనంతరం గంగంపాలెం గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే చంటిబాబు మాట్లాడుతూ గంగంపాలెం గ్రామంలో సుదీర్ఘకాలం 40 సంవత్సరాలు పైబడి నుండి పోడు భూముల పట్టాలు లబ్ధిదారులకు ఎంతమంది ఎమ్మెల్యేలు, మంత్రులు మారిన అప్పటి నుండి ఇప్పటివరకు ఇవ్వలేదని ప్రస్తుత సీఎం వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వంలో భూ హక్కు పట్టాలు పంపిణీలో భాగంగా 66 మంది లబ్ధిదారులకు పోడు భూముల పట్టాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. గంగపాలెం గ్రామంలో సుమారు 16 కోట్ల రూపాయలతో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో సీఎం జగన్మోహన్‌ రెడ్డి చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలే వారిని గెలిపిస్తాయని, ప్రజలు సీఎం జగన్మోహన్‌ రెడ్డి ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలు అభివద్ధిని చూసి ఓటు వేసి మరోసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్‌ రెడ్డిని గెలిపించుకోవాలని అలాగే ఎమ్మెల్యేగా నన్ను మరోసారి ప్రజలు దీవించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ జనపరెడ్డి సుబ్బారావు, మండల సచివాలయాల కన్వీనర్‌ దాసరి రమేష్‌, వైసీపీ సీనియర్‌ నాయకులు సుంకర వీరబాబు, వైసీపీ మండల కన్వీనర్‌ పాటి రాంబాబు, దొడ్డి నాగేశ్వరరావు, సీతా దుర్గ బాబు, మడికి మైనర్‌ బాబు, కర్రీ సురారెడ్డి,కర్రీ శివరామకృష్ణ, దొడ్డ విజరు, పైలా కళ్యాణ్‌, తోలేటి రాంప్రసాద్‌, ప్రసన్న, అబ్బులు, తాసిల్దార్‌ ఏ శ్రీనివాస్‌, ఎంపీడీవో కే పద్మజ్యోతి, ఈఓపిఆర్డిఎం రాజేశ్వరరావు, పంచాయతీ కార్యదర్శి ఏవి గోవింద్‌, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.

➡️